Vinjamur: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం

Vinjamur: వింజమూరు మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Sept 2026 6:17 PM IST
Vinjamur
X

Vinjamur: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం

వింజమూరు: నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు.

వ్యవసాయ శాఖ అధికారి వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్,టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలు, సేవలను రైతులకు చేరువ చేయడంతో పాటు ప్రతి పంచాయతీ, గ్రామంలో ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని కోరారు.రైతులు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవాలని ఆయన సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story