Vinjamur: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇరిగేషన్ డీఈ హెచ్చరిక
Vinjamur: వింజమూరు మండలం శంఖవరంలో వాగు పోరంబోకు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించి హెచ్చరికలు జారీ చేశారు.
Vinjamur: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇరిగేషన్ డీఈ హెచ్చరిక
వింజమూరు: ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా, పశువుల కొట్టాలు ఏర్పాటు చేసినా ఉపేక్షించేది లేదని ఇరిగేషన్ డీఈ రమణరావు హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంలో భాగంగా శంఖవరం గ్రామంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.
గ్రామంలోని కొంతమంది వ్యక్తులు వాగు పోరంబోకు, ప్రభుత్వ భూములను ఆక్రమించి పశువులు, గొర్రెలను ఉంచేందుకు కొట్టాలు ఏర్పాటు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలన నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్వే నంబర్లు 167, 169లో వాగు పోరంబోకు భూములు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి శాశ్వత నిర్మాణాలు చేపట్టడం, పశువుల కొట్టాలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని డీఈ రమణరావు స్పష్టం చేశారు.
వాగులు,వాగు పోరంబోకు స్థలాలు, రెవెన్యూ భూములను ఎవరూ ఆక్రమించరాదని హెచ్చరించారు. ఇప్పటికే ఆక్రమణలు చేసిన వారు స్వచ్ఛందంగా వాటిని తొలగించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ఆక్రమణలు తొలగించకపోతే అధికారుల ఆధ్వర్యంలో తొలగింపు చర్యలు చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ భూములు, నీటి వనరుల స్థలాల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడితే ఎలాంటి మినహాయింపులు ఉండవని డీఈ రమణరావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ మహేంద్ర, ఎస్సై ఉమామహేశ్వరరావు, వీఆర్వో సాజిత్, మండల సర్వేయర్ రవి, విలేజ్ సర్వేయర్‌తో పాటు ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.




