Vinjamur: వింజమూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఇద్దరికి తీవ్ర గాయాలు

Vinjamur: వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు వద్ద కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆత్మకూరు ఆసుపత్రికి తరలింపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Aug 2026 7:12 PM IST
Vinjamur
X

Vinjamur: వింజమూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఇద్దరికి తీవ్ర గాయాలు

వింజమూరు: నెల్లూరు జిల్లా వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వింజమూరు నుంచి కావలి వైపు వెళ్తున్న కారు రహదారి పక్కన నిలిచి ఉన్న బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న జీబీకేఆర్ ఎస్టీ కాలనీకి చెందిన నరసింహులు,ముసలిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్‌లో క్షతగాత్రులను వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story