Venkatachalam: విక్రమ సింహపురి వర్సిటీ స్కాలర్ ములుమూడి శిల్పకు డాక్టరేట్ ప్రదానం!

Venkatachalam: విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎంబీఏ విభాగానికి చెందిన ములుమూడి శిల్ప పీహెచ్‌డీ పట్టా సాధించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Sept 2026 10:45 AM IST
Venkatachalam
X

Venkatachalam: విక్రమ సింహపురి వర్సిటీ స్కాలర్ ములుమూడి శిల్పకు డాక్టరేట్ ప్రదానం!

Venkatachalam: వెంకటాచలం మండలం విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎంబీఏ విభాగ పరిశోధక విద్యార్థిని ములుమూడి శిల్ప డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.) డిగ్రీకి అర్హత సాధించారు.ఆచార్య సుజా ఎస్. నాయర్ పర్యవేక్షణలో “A Study on Employee Engagement and Its Impact on Employee Performance in Select Organized Retail Companies in Telangana” అనే అంశంపై శిల్ప తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు.

ఎగ్జామినర్ల సిఫార్సుల మేరకు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానంచేసింది.ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు శిల్పా ములుమూడికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వర్సిటీలో పరిశోధనా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, సమాజానికి, పరిశ్రమలకు ఉపయోగపడే అంశాలపై పరిశోధకులు మరింత దృష్టి సారించాలని సూచించారు.

శిల్ప భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేపట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మరెన్నో ప్రతిభలు కనబరచి తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని అధ్యాపకులు తెలిపారు. ఎంబీబీఎస్ విద్యార్థి ముల్లుమూడి శిల్ప తోటి విద్యార్థులకు యూనివర్సిటీ లో చదివే విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె. సునీత, ప్రిన్సిపల్ ఆచార్య టి. వీరారెడ్డి, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి డాక్టర్ సాయి స్రవంతి, అధ్యాపకులు డాక్టర్ చెంచు రెడ్డి, డాక్టర్ జె. విజేత, గాయత్రి అనుపమ తదితరులు పాల్గొని శిల్పను అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story