Vidavaluru: విడవలూరులో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి!

Vidavaluru: విడవలూరు జడ్పీ హైస్కూల్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన కోవూరు ఎమ్మెల్యే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Aug 2026 3:35 PM IST
Vidavaluru
X

Vidavaluru: విడవలూరులో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి!

Vidavaluru: కోవూరు నియోజకవర్గం లోని విడవలూరు మండలం జడ్పీ హైస్కూల్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

మండలంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విద్యార్థుల ప్రతిభను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యార్థులు చిన్ననాటి నుంచే ఇతరులకు సహాయ సహకారాలు అందించే మంచి అలవాటును అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనేక విద్యా సంస్కరణలు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీజీ విడవలూరు మండలానికి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇదే ప్రాంతానికి చెందిన పుచ్చలపల్లి సుందరయ్య, పుచ్చలపల్లి రామచంద్రారావు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు.ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటాలని... నేడు నాటిన ఒక్కో చెట్టు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సూచించారు. నేటి యువతే దేశ భవిష్యత్తు అని, గొప్ప నాయకత్వంలో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ... కుల, మత, ప్రాంతలకు అతీతంగా అందరూ కలిసి, కలిసికట్టుగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్ర్య దినోత్సవమని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కొనియాడారు.దేశభక్తి నినాదాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, జాతీయ పతాక రెపరెపల మధ్య విడవలూరు మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story