Vidavaluru: పార్లపల్లిలో గీత కార్మికులకు ఉచిత ప్రమాద బీమా

Vidavaluru: విడవలూరు మండలం పార్లపల్లిలో కల్లుగీత కార్మికులకు పోస్టల్ శాఖ ద్వారా రూ. 15 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీలు అందజేత. ఘనంగా చిన్నారి పుట్టినరోజు వేడుకలు.

V. Narasimhulu, Nellore
Published on: 7 Aug 2026 3:47 PM IST
Vidavaluru
X

Vidavaluru: పార్లపల్లిలో గీత కార్మికులకు ఉచిత ప్రమాద బీమా

విడవలూరు: శుక్రవారం ఉదయం 11 గంటలకు విడవలూరు మండలం పార్లపల్లిలో గౌడ సంక్షేమ సంఘం యువజన యువజన సంఘం ప్రధాన కార్యదర్శి దద్దోలు పవన్ తేజ గౌడ్ కుమారుడు దద్దోలు వేదాన్ష్ రామ్ గౌడ్ పుట్టినరోజు పురస్కరించుకొని, కల్లుగీత కార్మికులకు ప్రమాద బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, గ్రామంలోని కల్లుగీత కార్మికులకు పాలసీలను పోస్ట్ ఆఫీస్ ద్వారా కట్టించడం జరిగింది.

పై కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తెరకాల శీనయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.... గౌడ సంక్షేమ సంఘం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పర్యటిస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ గౌడ కల్లుగీత కార్మికుల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తున్నామని, అందులో భాగంగా నేడు పార్లపల్లి గ్రామంలో గీత కార్మికులకు ఒక్కొక్కరికి 15 లక్షలు విలువచేసే ప్రమాద బీమా పాలసీలను ఉచితంగా కట్టించడం జరిగినదని ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించిన యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దద్దోలు పవన్ తేజ గౌడ్ ని ఆయన అభినందించారు.

గతంలో కూడా ఇలాగే ఊటుకూరు గ్రామంలో బాలచంద్రా అనే గౌడ కుటుంబం పిడుగుపాటుకు లోనై గృహాపకరణాలన్నీ కాలిపోగా... వారికి సైతం పదివేల రూపాయలను అందించి తన వంతు దాతృత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు.

అలాగే పార్లపల్లి గ్రామంలోని గీత కార్మికులతో పాటు గౌడ సోదరులందరూ ప్రమాద భీమా పాలసీలను తీసుకోవాలని, తద్వారా ఊహించని ప్రమాదాల ద్వారా నష్టపోయినప్పుడు కుటుంబాలు తీవ్రంగా కష్టనష్టాలు పాలవకుండా చేసిన వారవుతారని, కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అలాగే కల్లుగీత కార్మికులు నిత్యం వృత్తిపరంగా ప్రమాదాలను జయించాలి అన్నారు.. అలాగే రాబోవు రోజుల్లో జిల్లాలోని అన్ని గ్రామాలలో కల్లుగీత కార్మికులు గౌడ కుటుంబ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలను తప్పకుండా చేసుకునే విధంగా జాగృతం చేస్తామన్నారు.

పై కార్యక్రమంలో వందమందికి పైగా గీత కార్మికులు గౌడ్ పోస్టల్ శాఖ ద్వారా ప్రమాద భీమా పాలసీలను తీసుకోవడం జరిగింది. పోస్టల్ శాఖ జిల్లా అభివృద్ధి అధికారి నర్సయ్య మాట్లాడుతూ.... గ్యాంగ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యేక భీమా కలిగినటువంటి పాలసీలు కూడా, అదేవిధంగా ఆడపిల్లలకు సంబంధించిన పథకాలు ఉన్నాయని, అదే విధంగా 65 సంవత్సరాలు పైబడిన వారికి కూడా నెలనెలకు కట్టుకునేటువంటి సదుపాయాలు కూడా ఉన్నాయని, లేదు వాళ్ళ పిల్లల మ్యారేజ్ పర్పస్ కు, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కు, సంబంధించి ఫిక్స్డ్ చేసుకోవాలని, అమౌంట్ మొత్తం డబుల్ అవుతూ... వచ్చేటటువంటి, స్కీమ్స్ ను ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాలసీలను తీసుకోవాలని పిలుపునిచ్చారు.

పై కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారులు మనోజ్ కుమార్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ ,గౌడ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి రమేష్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కు రాధాకృష్ణ గౌడ్, ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు దద్దోలు చక్రపాణి గౌడ్ ,జిల్లా అధ్యక్షులు తుళ్లూరు మల్లికార్జున గౌడ్, నాయకులు ఉప్పల శ్రీహరి గౌడ్, జడపల్లి వెంకటరత్నం గౌడ్, రావుల సుబ్రహ్మణ్యం గౌడ్, దద్దోలు పవన్ తేజ గౌడ్, జంపాని వంశీకృష్ణ గౌడ్, రావుల సుధాకర్ గౌడ్ , బండ్ల సతీష్ గౌడ్, వేపూరు సుధీర్ గౌడ్ మరియు గ్రామస్తులు, మరియు విడవలూరు పరిధిలోని పోస్టల్ శాఖ సంబంధించి జిడిఎస్ స్టాఫ్ పాల్గొన్నారు

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story