Nellore: బుల్లెట్ బండిపై సందడి చేసిన వేమిరెడ్డి దంపతులు

Nellore: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు బుల్లెట్ బైక్‌పై సరదాగా గడిపిన క్షణాలు ఆకట్టుకున్నాయి.

V. Narasimhulu, Nellore
Published on: 9 May 2026 3:02 PM IST
Nellore
X

Nellore

Nellore: దైనందిన జీవితంలో క్షణం తీరిక లేకుండా, దాదాపు రోజులో 18 గంటల పైగా ప్రజా జీవితం గడుపుతూ...‌ ఎప్పుడు ప్రజలతో మమేకమవుతూ... వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ.... వారి సంతోషంలోనూ.. దుఃఖంలోనూ తోడుగా ఉంటూ... దాదాపుగా తమ వ్యక్తిగత జీవితాన్ని మర్చిపోయేంత బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికినీ...

ఎంతటివారికైనా అప్పుడప్పుడు మనసు చిన్ని చిన్ని ఆనందాల వైపు లాగుతూనే ఉంటుంది... అలాంటి అపురూప దృశ్యమే ఇప్పుడు మనం చూస్తున్నాం....

ప్రజల సేవే ప్రామాణికంగా, నేటి రాజకీయాలలో మచ్చలేని నాయకులుగా, పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ... సాయం అందించే నెల్లూరు పెద్దారెడ్డిగా.. ప్రజలు పిలుచుకునే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు

సరదాగా బుల్లెట్ బండి ఎక్కుతూ గడిపిన కొన్ని క్షణాలు కనుల పండుగగా అనిపించాయి...బుల్లెట్ అంటే ఎంపీ వేమిరెడ్డికి చాలా ఇష్టం అని అన్నారు. అయినా బుల్లెట్ బండి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. అటువంటి బుల్లెట్ బండిని తయారు చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీని మన ఆంధ్రప్రదేశ్ కి తెచ్చింది సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ . అంటే ప్రఖ్యాత 'బుల్లెట్' మోటార్‌ సైకిల్ ఇకపై ఏపీలోనే తయారు కానుంది మరి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story