Nellore: "నిజమేంటో విపిఆర్ ప్రజలకు చెప్పాలి... ఊటుకూరు నాగార్జున డిమాండ్"

Nellore: నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలకు మద్దతుగా ఊటుకూరు నాగార్జున స్పందించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 4 Sept 2026 4:03 PM IST
Nellore
X

Nellore: "నిజమేంటో విపిఆర్ ప్రజలకు చెప్పాలి... ఊటుకూరు నాగార్జున డిమాండ్"

Nellore: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మీ అనుచరుడు రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ గా ఉంటూ చైనాలో మేయర్ గా స్వాగతలు అందుకోవడం అబద్ధమా...? అక్కడికి వెళ్లిన ఇద్దరూ మీ అనుచరులు కాదా.. మేము అడిగింది అదే కదా అంటూ ప్రశ్నించారు ఊటుకూరు నాగార్జున.

అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి ఆధారాలు తీసుకువచ్చి మీడియా ముందు పెడతారని మీరు కలలో కూడా ఊహించి ఉండరని... అనిల్ స్థాయి ఏంటో ఇప్పటికైనా తెలుసుకోండని చెప్పారు.

ప్రెస్ మీట్ లో అనిల్ కుమార్ యాదవ్, VPR ని కానీ ఆయన అనుచరులను కానీ తప్పుగా మాట్లాడింది లేదని... కేవలం ఆధారాలు మాత్రమే బయటపెట్టారని... పెద్ద మనిషి ముసుగులో VPR మరియు ఆయన అనుచరులు చేసిన దందా మాత్రమే బయటపెట్టారని. చైనాకు చెందిన డవ్ అనే వ్యక్తి మైన్ లోకి వచ్చి ఇక్కడి వ్యాపారులను బెదిరిస్తున్నారంటే మీ VPR సపోర్ట్ లేకుండా జరుగుతుందా..? అని ప్రశ్నించారు.

అనిల్ కు సమాధానం చెప్పకుండా మీడియా ముందుకు వచ్చిన కొంతమంది VPR అనుచరులు... ఆయనకు వత్తాసు పలుకుతూ అనిల్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం కరెక్ట్ కాదని...ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా విమర్శించారని.. మీకంటే దారుణంగా మేము కూడా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం ఉందని అన్నారు. రెండేళ్లు అనిల్ రాజకీయాల్లో చురుకుగా లేకపోయినా.. కేవలం రెండు ప్రెస్ మీట్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపారని, గుమ్మడి కాయల దొంగల లాగా మీరు భుజాలు తవుడుకుంటున్నారని.. అదీ మా నాయకుడి స్థాయి అంటూ హెచ్చరించారు.

మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారంటే.. అది ముమ్మాటికీ పెద్ద మనిషి ముసుగులో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న తప్పు అని, ఆధారాలతో ప్రజల ముందు దొరికిపోయే సరికి దీనిని ఎలాగైనా డైవర్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఏదేదో మాట్లాడేస్తున్నారని... సిగ్గు అనిపించడం లేదా మీకు అంటూ ప్రశ్నించారు.

కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటూ... ప్రజలు ఆలోచన చేయాలి అని వ్యాఖ్యణించడం గమనార్హం అని.. అసలు అనిల్ కి మునిసిపల్ ఎన్నికలకు సంబంధం ఏమిటి అని అడుగుతున్నామని... ప్రజలకు అంతా తెలుసు.. డైవర్ట్ పొలిటిక్స్ మానుకోండి అంటూ హితవు పలికారు.

రిజర్వేషన్లు ఖరారు కాకముందే మేయర్ అభ్యర్థి విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు కాబట్టే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారని,

గిరిజన మహిళ మేయర్ గా ఉన్న సమయంలో 2024 నవంబరులో డిప్యూటీ మేయర్ గా ఉన్న వ్యక్తి చైనాలో మేయర్ గా చలామనీ అయ్యారంటే ఎంత దుర్మార్గనికి ఒడికట్టారో తెలుసుకోండి.. ఇది ముమ్మాటికీ దేశ ద్రోహమే అని అన్నారు..

గిరిజనుల పట్ల, దళితుల పట్ల మీకున్న చులకన భావానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర... బీసీ కోటాలో మీ అన్నదమ్ములు పదవులు తీసుకుంటే దళితులకు, గిరిజనులకు న్యాయం జరిగినట్టేనా..?

వైసీపీ పాలనలో మైస్లిమ్ ని మేయర్ గా ఎన్నుకున్నాం... బీసీని మంత్రిగా చూసాం.. గిరిజన మహిళను మేయర్ చేసిన ఘనత కూడా జగన్ దేనని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజన మహిళా పట్ల వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. నెల్లూరు ప్రజలు ఈ పరిణామాలను గమనించారు..

మంత్రి నారాయణ.. ఎస్సీ ఎస్టీ లు మీకు జెండాలు మోయడానికేనా..? పదవులు అనుభవించేందుకు పనికిరారా అని సూటిగా అడుగుతున్నానని అన్నారు..దళితుల పట్ల, గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే SC సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేయర్ అభ్యర్తిగా ప్రకటించాలి అని అన్నారు.

వేమిరెడ్డి కుటుంబం చేస్తున్న దోపిడీ చూసాక... ఇలాంటి వాళ్ళకా మేము ఓట్లు విసింది అని ప్రజలు అసహ్యించుకుంటున్నారని... మీ నిజం స్వరూపం చూసి పెద్దలు కూడా చీదరించకుంటున్నారని అన్నారు....తక్షణమే డవ్ తో ఎలాంటి సంబంధం లేదని vpr ప్రకటించాలని.... చైనాలో తప్పుడు హోదాలో తిరిగిన ఇద్దరు వ్యక్తులు నా అనుచరులు కాదు... సమాచారం లేకుండా వారు వెళ్లారు అని బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు నీలి రాఘవరావు, వేనాటి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story