Nellore: నేడు నెల్లూరుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్!

Nellore: వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాక సందర్భంగా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ అజిత భద్రతను సమీక్షించారు.

A Praveen, Nellore
Published on: 7 Sept 2026 12:01 AM IST
Nellore
X

Nellore: నేడు నెల్లూరుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్!

నెల్లూరు జిల్లా: వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 7, 2026న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్న నేపథ్యంలో, ఆయన పర్యటనకు సంబంధించి పటిష్ట బందోబస్ట్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ భద్రతా మరియు ఇతర ఏర్పాట్లను SPSR నెల్లూరు జిల్లా పోలీసు శాఖ సమగ్రంగా పరిశీలించింది.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సౌత్ కోస్టల్ రేంజ్, గుంటూరు శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, ఐపీఎస్ గారు, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ శ్రీ M.హేమ్ రాజ్ మీనా, ఐపీఎస్ గారుతో కలిసి జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రాంతాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఐపీఎస్ గారు హెలిప్యాడ్, అక్షర విద్యాలయ ప్రాంగణం, అరుజున గ్రౌండ్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, స్కేటింగ్ రింక్/ఆడిటోరియం, స్వామి వివేకానంద విగ్రహం, సోమా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, స్వర్ణ భారత్ ట్రస్ట్ మరియు ముప్పవరపు ఫౌండేషన్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి పర్యటనలో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాలు, భద్రతా విధులు, ప్రముఖుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, ప్రజలు మరియు విద్యార్థుల కదలికలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

పర్యటన కార్యక్రమాలపై సమగ్ర పరిశీలన

పర్యటనలో భాగంగా ఉదయం అక్షర విద్యాలయం – అరుజున గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి గారు చేరుకోనున్నారు. అనంతరం అక్షర విద్యాలయ పరిపాలనా భవనం వద్దకు చేరుకుని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, విద్యార్థులను పలకరించనున్నారు.

తదుపరి స్కేటింగ్ రింక్/ఆడిటోరియం వద్దకు చేరుకుని స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సోమా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించనున్నారు.

మధ్యాహ్న భోజన స్వర్ణ భారత్ ట్రస్ట్, వెంకటాచలంకు చేరుకుని, పరిపాలనా భవనం వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి, స్వర్ణ భారత్ ట్రస్ట్ మరియు ముప్పవరపు ఫౌండేషన్ను సందర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు పాల్గొంటారు.

కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన, జాతీయ గీతం/జాతీయ గానం, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వర్ణ భారత్ ట్రస్ట్‌పై ఆడియో-విజువల్ ప్రదర్శన, స్వాగత ప్రసంగం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రజాప్రతినిధుల అభినందనల తరువాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే భారతదేశ మాజి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు. వెంకయ్య నాయుడు గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చివరగా వందన సమర్పణతో కార్యక్రమం ముగియనుంది.

భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సూచనలు

పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారి భద్రత, కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజలు, విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారు అధికారులకు సూచించారు.

పర్యటనలోని ప్రతి కార్యక్రమ స్థలాన్ని ముందస్తుగా క్షుణ్ణంగా పరిశీలించి, ప్రవేశ–నిష్క్రమణ ప్రాంతాలు, వాహనాల రాకపోకలు, పార్కింగ్, ప్రజలు మరియు విద్యార్థుల కదలికలు, వేదిక పరిసరాలు, హెలిప్యాడ్ ప్రాంతం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే వివిధ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమం ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో ఉన్న ప్రతి అధికారి మరియు సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను అప్రమత్తంగా, సమన్వయంతో నిర్వహించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి సి.హెచ్. సౌజన్య గారు,నెల్లూరు రూరల్ DSP శ్రీ ఘట్టమనేని శ్రీనివాస్ రావు గారు, నెల్లూరు ఆర్డీఓ గారు, వెంకటాచల సత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇతర సబ్ డివిజన్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్,పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా, సురక్షితంగా మరియు ప్రశాంతంగా నిర్వహించేందుకు SPSR నెల్లూరు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపడుతోంది.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story