Nellore: నేడు నెల్లూరుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్!

Nellore: వెంకటాచలం రానున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవాల్లో భాగస్వామ్యం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Sept 2026 10:46 AM IST
Nellore
X

Nellore: నేడు నెల్లూరుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్!

Nellore: నేడు నెల్లూరు జిల్లా వెంకటాచలం రానున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. స్వర్ణ భారతీ ట్రస్టు స్వర్ణోత్సవ వేడుకలకు హాజరుకానున్న యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తో కలిసి స్వర్ణ భారత్ ట్రస్ట్ సందర్శనకు విస్తృత ఏర్పాట్లు వెంకటాచలంలోని అక్షర విద్యాలయం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్,సోమా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ సహా స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.

ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు అక్షర విద్యాలయం నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ కు చేరుకుని స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్న యోగి.

మధ్యాహ్నం 3.40 గంటలకు హెలిప్యాడ్ నుంచి తిరిగి వెళ్ళనున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాక నేపథ్యంలో స్వర్ణ భారత ట్రస్టు ప్రాంతంలో భారీగా భద్రత ఏర్పాట్లు. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ముందస్తు ఏర్పాట్లు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story