Marripadu: రూ.కోటి వెచ్చించినా ప్రారంభానికి నోచుకోని ఇర్లపాడు సచివాలయం!

Marripadu: మర్రిపాడు ఇర్లపాడులో రూ.కోటితో కట్టిన సచివాలయం ప్రారంభానికి నోచుకోక కంపచెట్లతో శిథిలావస్థకు చేరడంపై ప్రజల ఆగ్రహం.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 1 Sept 2026 5:03 PM IST
Marripadu
X

Marripadu: రూ.కోటి వెచ్చించినా ప్రారంభానికి నోచుకోని ఇర్లపాడు సచివాలయం!

Marripadu: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంకి కూకటి దూరములో ఉన్నటువంటి ఇర్లపాడు పంచాయతీలోని ఇస్కపల్లి దగ్గర దాదా కోటి రూపాయలు అంచనాతో కట్టిన సచివాలయం పూర్తయి దాదాపు మూడు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ప్రారంభానికి నోచుకోకుండా కంపచెట్లు అల్లుకొని పోయి ఉన్నది.

రెండు పంచాయతీలు కలిపి ఇటు ఇర్లపాడు అటు పెగల్లపాడు రెంటికీ మధ్యలో ఇస్కపల్లిలో నిర్మించినటువంటి ఈ సచివాలయం అటు ధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కన్నెత్తి కూడా చూడకపోవడం చాలా దారుణం. మండలంలో 17 సచివాలయాలు ఉండగా 16 సచివాలయాలు ప్రారంభించి ఆ సచివాలయాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు.

కానీ ఇ ర్లపాడులో కట్టినటువంటి సచివాలయం ప్రారంభానికి నోచుకోక కంప పోదలు అల్లుకుపోయి పూర్తిగా రోజు రోజుకి శిథిలావస్థ పడే స్థాయికివస్తుంది .కానీ ఇటు ఉన్నతాధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ పట్టించుకోకపోవడం చాలా దారుణం. సచివాలయం కార్యకలాపాలు ఒక పంచాయతీ బిల్డింగులోనే నిర్వహించడం ప్రజలు అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సచివాలయం ప్రారంభించి కార్యకలాపాలు సచివాలయంలోనే జరిగేటట్లు చూస్తారని ప్రజలు ఇబ్బందులు పడకుండా కల్పిస్తారని కోరుచున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story