Nellore: నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి జాతర - రూ. 1.15 కోట్లతో పనులకు శ్రీకారం!

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలిసి రూ. 1.15 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 4:17 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి జాతర - రూ. 1.15 కోట్లతో పనులకు శ్రీకారం!

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ ముత్యాలపాలెంలో 1, 2, 12, 17 మరియు 19 డివిజన్లలో 1 కోటి 15 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. తన లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి ఒక్కటే అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

నిత్యం ప్రజల్లోన్నే ఉంటామని, కూటమి ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకొని వెళ్తామని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.

నెల్లూరు జిల్లా తెలుగుదేశం నేతలందరం ఒక్కతాటిపై ఉంటామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

నిన్న జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసి పిల్లలు సైతం నవ్వుకుంటున్నారని అన్నారు.

నెల్లూరు రూరల్ లో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు జిల్లాలో ఉండే శాసనసభ్యులను పిలిచే ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. శ్రీధర్ అన్న ప్రజలతో మమేకమయ్యే తీరు అద్భుతమని, నాయకులకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ శ్రీధర్ అన్నకు ఉన్నాయని చెప్పారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story