Nellore: అదను చూసి ఇల్లు గుల్ల చేసిన గుర్తుతెలియని దుండగులు!

Nellore: నెల్లూరు జిల్లా గండిపాలెంలో ఒంటరి మహిళ హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఇల్లు గుల్ల చేసి రూ. 50 వేల నగదు, 12 సవర్ల బంగారం దొంగిలించిన దుండగులు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 13 July 2026 1:20 AM IST
Nellore
X

Nellore: అదను చూసి ఇల్లు గుల్ల చేసిన గుర్తుతెలియని దుండగులు!

నెల్లూరు జిల్లా: ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి నగదు, బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం.

ఒంటరిగా నివసిస్తున్న మహిళ వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి ఉండగా ఈ చోరీ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంటికి తిరిగి వచ్చిన బాధితురాలు ఇంటి తాళాలు పగులగొట్టబడినట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఈ ఘటనలో సుమారు రూ.50 వేల నగదు,12 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న ఉదయగిరి ఎస్సై బి. మహేంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.చోరీకి పాల్పడిన దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేసి, చోరీకి గురైన నగదు, బంగారు ఆభరణాలను రికవరీ చేస్తామని ఎస్సై బి. మహేంద్ర తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI

Next Story