Udayagiri: వ్యవసాయ కళాశాలలో బయోఫోర్టిఫైడ్ వర్మికంపోస్ట్ యూనిట్ ప్రారంభం
Udayagiri: ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో బిఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థుల ELP ప్రోగ్రామ్‌లో భాగంగా బయోఫోర్టిఫైడ్ వర్మికంపోస్ట్ యూనిట్ రెండో బ్యాచ్‌ను అసోసియేట్ డీన్ ప్రారంభించారు.
Udayagiri: వ్యవసాయ కళాశాలలో బయోఫోర్టిఫైడ్ వర్మికంపోస్ట్ యూనిట్ ప్రారంభం
ఉదయగిరి: ఉదయగిరిలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి ఫైనల్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థుల ఎక్స్‌పీరియెన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (ELP)లో భాగంగా బయోఫోర్టిఫైడ్ వర్మికంపోస్ట్ యూనిట్ రెండో బ్యాచ్ ప్రారంభమైంది.
ఈ బ్యాచ్‌లో 14 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. కార్యక్రమానికి కళాశాల అసోసియేట్ డీన్ డా. టి. గోపీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, ప్రయోగాత్మక విద్య ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలతో పాటు పారిశ్రామిక దృక్పథం పెంపొందుతుందని తెలిపారు.
బయోఫోర్టిఫైడ్ వర్మికంపోస్ట్ తయారీ, నాణ్యత నియంత్రణ, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణపై ప్రత్యక్ష అనుభవం పొందాలని సూచించారు.కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డా. జి. రఘునాథ రెడ్డి, మేనేజర్ డా. జి.కె. సూర్య కృష్ణ, అధ్యాపకులు డా. పి. శోభారాణి, డా. కె. శ్రీ వందన, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




