Atmakur: ఆత్మకూరులో విద్యుత్ కష్టాలు.. సబ్‌స్టేషన్ ఎదుట కాలనీ వాసుల నిరసన!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విద్యుత్ సమస్యలపై గిరిజన కాలనీ వాసుల వినూత్న నిరసన.
Atmakur: ఆత్మకూరులో విద్యుత్ కష్టాలు.. సబ్‌స్టేషన్ ఎదుట కాలనీ వాసుల నిరసన!
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు పట్టణంలో తరచు విద్యుత్ సమస్యలతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ముందస్తు ప్రణాళిక లేక ఏమి తోనే ఈ సమస్య ఎదురవుతుందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇందులో భాగంగా తమ ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫారం కాలిపోయి గత రెండు రోజులుగా కరెంటు లేకపోవడంతో పలుమార్లు విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించిన సమయానికి విద్యుత్ సిబ్బంది స్పందించకపోవడంతో నిరసనగా ఆత్మకూరు పట్టణంలోని 19వవార్డు ఏకలవ్య నగర్ ప్రాంత వాసులు సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు వెళ్లి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా అక్కడే నేలపై నిద్ర పోయారు.
తెల్లవారుజాము మూడున్నర వరకు అక్కడే ఉండి ఇళ్లకు చేరుకున్నారు.. తరచూ ఆత్మకూరు పట్టణంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని రాత్రి వేళలో అత్యధిక సార్లు విద్యుత్ నిలిచిపోతుందని దీంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అందుకే ఇక్కడ వచ్చి నిద్రపోయి ఈ విధంగా తమ బాధను వ్యక్తపరిచామని అన్నారు.
కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆత్మకూరు పట్టణంలో విద్యుత్ సమస్యలు సరి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




