Nellore: ట్రాలీ బీభత్సం.. టైరు పగిలి బోల్తా పడిన వాహనం, ఒకరి మృతి!
Nellore: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం చింతలగుంట వద్ద జాతీయ రహదారి 565 పై ట్రాలీ టైరు పగిలి బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు.
Nellore: ట్రాలీ బీభత్సం.. టైరు పగిలి బోల్తా పడిన వాహనం, ఒకరి మృతి!
నెల్లూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం చింతలగుంట సమీపంలోని జాతీయ రహదారి-565పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్వేల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు డెకరేషన్ సామాన్లతో వెళ్తున్న ట్రాలీ వాహనం మార్గమధ్యంలో టైరు పగిలిపోవడంతో డ్రైవర్ అదుపు కోల్పోయి వాహనం రోడ్డుపై బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. టైరు పగిలిపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




