Nellore: డీసీపల్లిలో పొగాకు వేలం షురూ: రైతులకు గిట్టుబాటు ధర దక్కేనా?
నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో నేటి నుండి పొగాకు కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
Nellore: డీసీపల్లిలో పొగాకు వేలం షురూ: రైతులకు గిట్టుబాటు ధర దక్కేనా?
ఆత్మకూరు: నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో నేటి నుండి పొగాకు కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ డినిపల్లి పొగాకు వేలంకేంద్రం పరిధిలో 2095 మంది రైతులు 1742.75 బారన్లకుసరిపడు పొగాకును రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. అందుకు సంబంధించి పొగాకు బోర్డు 6.38 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతి ఇచ్చిందన్నారు.
అయితే రైతుల వద్ద నుంచి 10.20 మిలియన్ కేజీల పొగాకు వస్తుందని అంచనా వేయడం జరిగిందన్నారు. ఈ బోర్డు పరిధిలో 5295 హెక్టార్లలో రైతులు పొగాకును సాగు చేసినట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ గిట్టుబాటు ధరలు లభిస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందక తప్పడం లేదు.ప్రస్తుత ఏడాది పొగాకు పంటను పండించేందుకు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన నేపథ్యంలో ధరలపై రైతులు డోలాయమానంలో మునిగి తేలుతున్నారు. ఒకవేళ గిట్టుబాటు ధరలు లభించకపోతే నష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు.


