Dakkili: డక్కిలి మండలంలో పర్యటించిన శ్రీకాళహస్తి ఆర్డీవో
Dakkili: డక్కిలి మండలంలో ప్రభుత్వ పాఠశాల క్రీడాప్రాంగణ ఆక్రమణలను పరిశీలించిన ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి. వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు.
Dakkili: డక్కిలి మండలంలో పర్యటించిన శ్రీకాళహస్తి ఆర్డీవో
డక్కిలి: ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం పలు గ్రామాల్లో శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. డక్కిలి మండల ప్రధాన కేంద్రం జడ్పీ హైస్కూల్ విద్యార్థుల క్రీడా ప్రాంగణ స్థలము ఆక్రమునకు గురైందని, సుమారు సర్వే నంబర్ 112- 8,9 భూమిలో రెండు ఎకరాల 30 సెంట్లు స్థానికులు ఆక్రమించారని ఫిర్యాదు అందడంతో , ఆయన రెవిన్యూ సిబ్బంది అధికారులు బృందంతో క్రీడాస్థలంలో పరిశీలించి ఆక్రమణలు గుర్తించారు.
స్థానిక రెవెన్యూ తాసిల్దార్ కు, సర్వేర్ కు, క్రీడాస్థలంలోని ఆక్రమణలు వెంటనే తొలగించాలని ఆర్డీవో సూచించారు. డక్కిలి మండల రైతులు సుమారు సర్వే.నంబర్ 258-1 లోభూమి లో 8 మంది రైతులు ఎనిమిది ఎకరాలు భూమిలో గత 20 ఏళ్లగా వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారని, మరో వర్గం 8 మందిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ భూమిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, ఈ భూమి కోర్టు పరిధిలో ఉందని, పూర్తి సమగ్ర నివేదిక జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని తెలిపారు.
మండలంలోని పలు రెవిన్యూ గ్రామాల్లో పర్యటించి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల కోసం, రైతులతో భూ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.




