Atmakur: పన్నులు కడుతున్నాం.. పట్టాలు ఎప్పుడిస్తారు? ఆత్మకూరు పేదల ప్రశ్న
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తిప్ప పోరంబోకు నివాసితుల భారీ నిరసన. రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ పావనికి వినతిపత్రం అందజేత.
Atmakur: పన్నులు కడుతున్నాం.. పట్టాలు ఎప్పుడిస్తారు? ఆత్మకూరు పేదల ప్రశ్న
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తిప్ప పోరంబోకు నివాసితులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ మున్సిపల్ బస్టాండ్ లోని అంబేడ్కర్ విగ్రహం నుండి ప్రారంభమై బిఎస్ఆర్ సెంటర్ మీదుగా ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఆర్డీవోకు సుమారు 300 మంది తిప్పవరం బోకు నివాసితులు వినతిపత్రం అందజేశారు.
సానుకూలంగా స్పందించిన ఆర్డిఓ బి పావని మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వరమే న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ అధ్యక్షుడు కొప్పోలు డేవిడ్ రాజు మాట్లాడుతూ ఆత్మకూరులో వందల ఏళ్లుగా తిప్ప పోరంబోకులో నివాసముంటున్న నిరుపేదలకు ప్రభుత్వం పొజిషన్ సర్టిఫికెట్ మాత్రమే మంజూరు చేసిందని అయితే ఇంటి పనులు మాత్రం అందరిలాగే తిప్ప పోరంబోకులో నివాసం ఉంటున్న వారికి వేస్తున్నారని అన్నారు.
2024లో తిప్ప పోరంబోకు ను అనాధీన భూమిగా అప్పటి ఆర్డిఓ మార్చినప్పటికీ నేటికి అది కార్యరూపం కార్యరూపం దాల్చక నేటికీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేయడంలో జాప్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఈ తిప్పు పోరంబోకులోనే సుమారు 10 వార్డుల ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీల పేద ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు.
ఈ ప్రాంతంలో నివాసం ఉండేవారు తమ ఇళ్లను అమ్ముకునేందుకు క్రయ విక్రయాల చేసుకునేందుకు వీలు లేకపోవడంతో నిరుపేదలు ఏదైనా అత్యవసర పరిస్థితులలో ఇళ్లను అమ్ముకోలేకపోతున్నారని అన్నారు. కావున వెంటనే రిజిస్ట్రేషన్ పట్టాలు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మా సిపిఎం పార్టీ తరఫున కార్యచరణ రూపొందించి ఆందోళన ఉదృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు శివయ్య, నాగయ్య,గుల్జార్ బేగం తదితరులు,తిప్ప పోరంబోకు నివాసితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




