Nellore: వీపీఆర్ దంపతులపై వైకాపా నేతల చిల్లర వ్యాఖ్యలు సరికాదు బీద
Nellore: వీపీఆర్ దంపతులపై అనిల్ యాదవ్, ప్రసన్నల విమర్శలను తీవ్రంగా ఖండించిన బీద రవిచంద్ర. ఏపీపీఎస్సీ అక్రమాలపై డైవర్షన్ రాజకీయం చేస్తున్నారన్న MLC.
Nellore: వీపీఆర్ దంపతులపై వైకాపా నేతల చిల్లర వ్యాఖ్యలు సరికాదు బీద
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శాసనమండలి సభ్యులు టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ శాసనమండలి సభ్యులు బూదాటి రాధయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ లు జెన్ని రవణయ్య, భూలక్ష్మి, పి యల్ రావు, మామిడాల మధు, అమృల్లా, దర్శి హరికృష్ణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ...
విపిఆర్ దంపతులపై అనిల్, ప్రసన్న పదేపదే చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలను, బెదిరింపులను తెలుగుదేశం పార్టీ ఖండిస్తోందని చెప్పారు.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపిఆర్ దంపతులపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, హద్దులు మీరి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు...వీపీఆర్ తెలుగుదేశం పార్టీ లో చేరాక ఏమైనా కాంట్రాక్టర్ అయ్యారా? వారు 1989 నుంచే మైనింగ్ రంగంలో ఉన్నారు.
వారి కుటుంబం 1951 నుంచే మైనింగ్ వ్యాపారం చేస్తోందని చెప్పారు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత వై ఎస్ రాజా రెడ్డికి సైదాపురం, రాపూరు ప్రాంతాలలో మైనింగ్ భూములు అమ్మిన చరిత్ర వీపీఆర్ కుటుంబానిదని గుర్తు చేశారు...నల్లపరెడ్డి,ఆనం, మాగుంట, ఆదాల.... వంటి కుటుంబాల సేవల గురించి వీపీఆర్ ఏనాడు ప్రస్తావన తేలేదని, తమ కుటుంబం ఒక్కటే సేవ చేస్తోందని వీపీఆర్ ఏనాడు చెప్పలేదని, కుట్ర పూరితంగా లేని పోని పోలికలను అనిల్ తెస్తున్నారని అన్నారు... రాజకీయాలకు అతీతంగా వీపీఆర్ ట్రస్ట్ స్థాపించి 2 వేల పేద విద్యార్థులకు అండగా నిలిచారని, వీపీఆర్ నేత్ర ద్వారా 1.2 లక్షల మందికి నేత్ర పరీక్షలు, 70 వేల కంటి అద్దాలు అందించారని తెలిపారు.
200 కు పైగా ఆర్వో ప్లాంట్ లు పెట్టి దాహార్తి తీర్చడమే కాక, ప్రత్యేక టీమ్ లు పెట్టి వాటి నిర్వహణ ను సమర్థవంతంగా చేస్తున్నారని చెప్పారు. 2029 ఎన్నికల వరకు వేచి చూసే ఓపిక లేకపోతే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా, ప్రజా మద్దతు ఏ పాటిదో వీపీఆర్ దంపతులకు ప్రసన్న, అనిల్ చూపించాలని కోరుకుంటున్నాను అని సవాల్ చేశారు. చదువు రాని సోమిరెడ్డి అంటూ కాకాణి చేసిన వ్యాఖ్యలతో కాకాణి స్థాయి, మానసిక స్థితి ఏమిటో జిల్లా ప్రజలు తెలుసుకున్నారని,
సోమిరెడ్డి స్థాయి తగ్గించి మాట్లాడుతున్నా అనుకుని, తన స్థాయిని కాకాణి దిగజార్చుకుంటున్నారని చెప్పారు..అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేదల పక్షాన, నమ్మిన పార్టీ కోసం నిలబడే నాయకుడు సోమిరెడ్డి అని అన్నారు.. జడ్పీ ఛైర్మన్, రెండు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన కాకాణి కి "ఎదుటి వారి గురించి ఎలా మాట్లాడాలి" అనే కనీస స్పృహ లేకపోవడం విచారకరం అని,
ఏపీపిఎస్సీ నిర్వహణ లో జరిగిన అక్రమాల గురించి న్యాయస్థానాలలో విచారణ మొదలు కాగానే వైస్సార్సీపీ కొత్త డ్రామాలు మొదలు పెట్టిందని అన్నారు. ఏపీపిఎస్సీ నిర్వహణలో నాటి మంత్రులు, సకల శాఖల సజ్జల రామకృష్ణా రెడ్డి తో సహా కీలక నేతలు జైలుకు వెళ్ళాల్సి వస్తుందని వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు మొదలెట్టారని చెప్పారు..
కూటమి ప్రభుత్వం ఒక మంచి పని మొదలెట్టిన ప్రతీసారి బూటకపు ప్రచారం తో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారని చెప్పారు...2019 ఎన్నికల ముందు, 2014-19 మధ్య కాలంలో వైసీపీ నేతలు అబద్దపు ప్రచారాలను నమ్ముకున్నారని, గతంలో పింక్ డైమండ్, కమ్మ కులస్థులకే డీఎస్పీ పదోన్నతులు, వివేకా హత్య, కోడి కత్తి శీను ఘటన....వంటి విష ప్రచారాలతో ప్రజలను మోసం చేశారని చెప్పారు..
వైస్సార్సీపీ పార్టీ పుట్టిన నాటి నుండి నేటి వరకు అబద్దపు ప్రచారాలనే నమ్ముకుంది, ఆ పార్టీ 11 సీట్లకు పరిమితం అయినా నేతల బుద్ధి మాత్రం మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర.




