Kodavaluru: అశ్లీల నృత్యాలంటూ తప్పుడు కథనాలు: టీడీపీ నేత బద్దిపూడి ఆగ్రహం!

Kodavaluru: పెమ్మారెడ్డిపాలెం పార్కు ప్రారంభోత్సవంలో అశ్లీల నృత్యాలంటూ వచ్చిన తప్పుడు కథనాలపై కొడవలూరు మండల టీడీపీ యువత అధ్యక్షుడు బద్దిపూడి సూర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Sept 2026 11:44 PM IST
Kodavaluru
X

Kodavaluru: అశ్లీల నృత్యాలంటూ తప్పుడు కథనాలు: టీడీపీ నేత బద్దిపూడి ఆగ్రహం!

కొడవలూరు: పెమ్మారెడ్డిపాలెం గ్రామంలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారంటూ ఓ ప్రముఖ పత్రిక, ఛానల్‌లో వచ్చిన వార్త కథనాలపై కొడవలూరు మండల టీడీపీ యువత అధ్యక్షుడు బద్దిపూడి సూర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ యువత, ప్రజల సహకారంతో పెమ్మారెడ్డిపాలెం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.

తమ సొంత నిధులతో అభివృద్ధి చేసిన పార్కును ప్రారంభించేందుకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారని చెప్పారు. ఇది అధికారిక కార్యక్రమం కాదని, గ్రామంలోని కుటుంబాల ఆహ్లాదం కోసం నిర్వహించిన కార్యక్రమాన్ని అశ్లీల నృత్యాలుగా ప్రచారం చేయడం బాధాకరమన్నారు.

పెమ్మారెడ్డిపాలెం కళాకారులకు నిలయమని, గ్రామంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారని తెలిపారు. అసత్య ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎంపీ, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, వారిపై అవినీతి, అక్రమాలంటూ బురద చల్లడం తగదన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పెమ్మారెడ్డిపాలెం గ్రామ యువత పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story