Sullurpeta: అటకానితిప్ప-పెర్నాడు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ!
Sullurpeta: సూళ్ళూరుపేట అటకానితిప్ప-పెర్నాడు మధ్య రూ.67 లక్షలతో గ్రావెల్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే విజయశ్రీ భూమిపూజ. ఏళ్ల నాటి రవాణా కష్టాలు తీరుతున్నాయని హర్షం.
Sullurpeta: అటకానితిప్ప-పెర్నాడు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ!
Sullurpeta: తరతరాలుగా మారిన ప్రభుత్వాలు, మారిన నాయకులు... కానీ ఆ రెండు గ్రామాల ప్రజల రోడ్డు కష్టాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. "మా దారి ఏది?" అని అటకానితిప్ప, పెర్నాడు గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా వేసిన ప్రశ్నలకు ఎవరూ శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు.
కానీ, మాట ఇస్తే మడమ తిప్పని నైజంతో, చెప్పిన ప్రతి హామీని తీరుస్తూ ప్రజాదరణ పొందుతున్న తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆ ప్రాంత ప్రజల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తున్నారు.
బుధవారం సూళ్ళూరుపేట మండల పరిధిలోని అటకానితిప్ప — పెర్నాడు గ్రామాల మధ్య రూ.67 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ ఘనంగా భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వర్షాకాలంలో రాకపోకలు సాగించలేక పడుతున్న ఇబ్బందులను తాను స్వయంగా చూశానని, ప్రజల కష్టాలను తీర్చడమే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. తక్షణ ఉపశమనం కోసం గ్రావెల్ రోడ్డు పనులు ప్రారంభించామని, రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామీణులకు ప్రయాణం ఎంతగానో సులభతరం అవుతుందన్నారు.
అంతేకాక, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆర్ అండ్ బి (R&B) శాఖ నుంచి అటవీ శాఖకు డిజిపిఎస్ (DGPS) సర్వే ఫైల్‌ను పంపించామని విజయశ్రీ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ 'పరివేష్' (PARIVESH) పోర్టల్ ద్వారా త్వరలోనే అవసరమైన అటవీ శాఖ అనుమతులు సాధించి, అత్యంత నాణ్యమైన శాశ్వత రహదారిని అందుబాటులోకి తెస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
"ఎంతో మంది పాలకులు వచ్చారు... పోయారు... కానీ మా కష్టాలు చూసి వెంటనే స్పందించి, పనులు చేపట్టిన నాయకురాలు ఎమ్మెల్యే విజయశ్రీ గారే" అని అటకానితిప్ప, పెర్నాడు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇచ్చిన మాటను నెరవేర్చే ఎమ్మెల్యేగా ఆమె సాధిస్తున్న గుర్తింపుకు ఈ ఘటనే తార్కాణం.




