Nellore: పేద కుటుంబాలకు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అండ!

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పేద కుటుంబాలకు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 31 July 2026 6:01 PM IST
Nellore
X

Nellore: పేద కుటుంబాలకు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అండ!

నెల్లూరు: శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచి పరమేశ్వర రెడ్డి పేద కుటుంబాలకు మరోసారి అండగా నిలిచారు. కర్మకాండల నిర్వహణ కోసం నాలుగు కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని నువ్వూరుపాడు ఎస్సీ కాలనీకి చెందిన సుదర్శన పెంచలమ్మ , మహిమలూరు ముస్లిం కాలనీకి చెందిన షేక్ హుస్సేన్ బీ,ఆత్మకూరు 7వ వార్డు తూర్పు వీధికి చెందిన షేక్ మహబూబ్ జాన్,14వ వార్డు చింతచెట్ల కాలనీకి చెందిన రేకలగుంట మధు కుటుంబాలకు ఈ సాయం అందించారు.

గతంలో మున్సిపాలిటీకే పరిమితమైన ఈ సేవలను ప్రస్తుతం మండల పరిధిలోని పలు గ్రామాలకూ విస్తరించినట్లు కంచి పరమేశ్వర రెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ తమ కుటుంబ సభ్యుల అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి రాకూడదనేదే మా సంకల్పం అని ఆయన పేర్కొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story