Nellore: ఘనంగా కాత్యాయని వ్రతం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు!

Nellore: శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అనివెట్టి మండపంలో కాత్యాయని వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 15 Sept 2026 10:33 PM IST
Nellore
X

Nellore: ఘనంగా కాత్యాయని వ్రతం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు!

నెల్లూరు: మంగళవారము నాడు శ్రీ రాజ రాజేశ్వరీ అమ్మవారికి అనివెట్టి మండపము నందు ప్రత్యేకముగా ప్రత్యేకపూల అలంకారము చేసి కాత్యాయని వ్రతము జరిపించారు.

ఈ వ్రతము చేయుట వలన వధూవరులకు జాతక రీత్యా కుజదోషము, కాలసర్పదోషములు అన్నియు తొలగిపోయి ఉత్తమమైన వివాహము జరుగునని, స్త్రీలు సౌభాగ్యము కొరకు, ఆయురారోగ్యముల కొరకు, అన్యోన్య దాంపత్యము కొరకు ఈ యొక్క కాత్యాయని వ్రతమును చేయవచ్చునని, ఈ వ్రతమును ఆచరించిన యెడల ఉత్తమమైన ఫలితములు లభించునని ఆలయ అర్చకులు చెప్పారు.

పై కార్యక్రమములో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించుట జరిగినది. పైకార్యక్రమములో ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్ధన్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఏలూరు శిరీష, ఆలయ ధర్మకర్తలమండలి సభ్యులు గజరా నరేష్, దావులూరు జమున, గూడంశెట్టి దొరబాబు, మానికలానాగమణి,

బీరదోలు చంటి, చీపన తేజ, రాపూరు రాధాకుమారి, నాటకరాణి చిన పెంచలయ్య, కుల్లూరు వీర రాఘవేంద్ర ఆలయ ప్రధాన అర్చకులు, సూరావఝుల రఘురామమూర్తి, వేదపండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో జరిగిందని. చైర్మన్ మరియు సహాయ కమీషనరు ఏలూరు శిరీష, ధర్మకర్తల మండలి సభ్యులు కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE