Gudur: మత్తు పదార్థాల రహిత సమాజం కోసం గూడూరులో ఘనంగా 2కే రన్!

Gudur: గూడూరులో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఘనంగా 2కే రన్. సరదాతో మొదలయ్యే మత్తు జీవితాన్ని సంకెళ్లలోకి నెడుతుందని హెచ్చరించిన ఎస్పీ శబరీష్.

B NARASIMHA, GUDUR
Published on: 22 Aug 2026 11:01 AM IST
Gudur
X

Gudur: మత్తు పదార్థాల రహిత సమాజం కోసం గూడూరులో ఘనంగా 2కే రన్!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. యువతలో మాదకద్రవ్యాల పట్ల చైతన్యం తెచ్చేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శబరీష్ ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

​ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.గంజాయి సేవించడం సరధాతో మొదలై సంకెళ్లదాకా జీవితాన్ని తీసుకెళ్తుంది అని అన్నారు.

తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో కూడిన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. సమాజంలో ఉన్నత గౌరవం, హోదా లభించాలంటే అది కేవలం చదువుతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ స్నేహితులు ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తుంటే, వారిని నచ్చజెప్పి సన్మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు.

​ఈ సందర్భంగా మాదకద్రవ్యాలు వాడబోమని, సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా మారుస్తామని ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువకులతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్పీ స్వయంగా యువతతో కలిసి అడుగులు వేస్తూ 2కే రన్‌లో పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు.

​ఈ అవగాహన ర్యాలీలో భారీ సంఖ్యలో పోలీస్ అధికారులు, విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story