Nellore: సోమశిల నుంచి పెన్నా డెల్టాకు సాగునీరు విడుదల

Nellore: నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టా పరిధిలోని రెండో పంట సాగుకు ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి నీటిని విడుదల చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 May 2026 3:00 PM IST
Nellore
X

Nellore: సోమశిల నుంచి పెన్నా డెల్టాకు సాగునీరు విడుదల

Nellore: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం,సోమశిల జలాశయం నుంచి పెన్నాడెల్టా కు ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి సాగునీటి ని విడుదల చేశారు. ముందుగా గంగాదేవికి పూజలు చేసి నీటిలో వాయినం వదిలారు. అనంతరం పవర్ ప్రాజెక్టులో స్విచ్ ఆన్ చేసి రెండో పంటకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా జిల్లాలోని 2 లక్షల 29 వేల 300 ఎకరాలకు ఈ నీరు అందుతుందని చైర్మన్ చెప్పారు,

మొదటగా 17 వందల క్యూసెక్కులను పవర్ ప్రాజెక్టు ద్వారా విడుదల చేశామని అవసరాన్ని బట్టి ప్రాజెక్ట్ అధికారులు నీటి విడుదల పెంచుతామన్నారు, ఉత్తర కాలువలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ కాలువకు 2వ పంట సాగుకు నీటిని నిలిపివేశామని రైతులు సహకరించాలని కోరారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు విజయ కుమార్,జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి సునీతమ్మ, నారాయణ, ప్రాజెక్టు డి ఈ లు మల్లికార్జున, విజయబాబు, జె ఈ శరత్, నిఖిల్ తదితరులు ఉన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story