Kondapuram: రిసోర్స్ కోఆర్డినేటర్ మురళిని అడ్డుకున్న గ్రామస్తులు!

Kondapuram: తూర్పు ఎర్రబల్లి సచివాలయంలో వైసీపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న రిసోర్స్ కోఆర్డినేటర్ మురళిని గ్రామస్తులు అడ్డుకోగా, టీడీపీ చర్యలకు డిమాండ్ చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 July 2026 8:43 PM IST
Kondapuram
X

Kondapuram: రిసోర్స్ కోఆర్డినేటర్ మురళిని అడ్డుకున్న గ్రామస్తులు!

కొండాపురం: నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లి గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్న SIR కార్యక్రమంలో వివాదం చోటుచేసుకుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో మండల రిసోర్స్ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. మురళి, బూత్ నెం.182 వద్ద బీఎల్ఓ శివప్రసాద్‌తో కలిసి విధుల్లో పాల్గొంటున్న సమయంలో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మురళి వైఎస్సార్సీపీకి చెందిన ఓటర్ల జాబితాను పట్టుకుని పార్టీ బీఎల్ఏగా వ్యవహరిస్తున్నారని కొందరు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై ఆయనను గ్రామస్తులు ప్రశ్నించి అడ్డుకున్నట్లు సమాచారం.ఈ ఘటనపై స్పందించిన గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. ఎం. మురళిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story