Nellore: నెల్లూరులో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!

Nellore: కూరగాయల మార్కెట్‌లో సింహపురి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ పాల్గొన్న వైయస్సార్‌సీపీ మాజీ సేవాదళ్ అధ్యక్షుడు మాళెం సుధీర్ కుమార్ రెడ్డి

A Praveen, Nellore
Published on: 13 Sept 2026 9:44 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!

Nellore: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సింహపురి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

నెల్లూరు కూరగాయల మార్కెట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మాళెం సుధీర్ కుమార్ రెడ్డి పాల్గొని భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున, ప్రకృతికి హాని కలగకుండా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు.

“భక్తితో పాటు బాధ్యత కూడా అవసరం.. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి సంకల్పం కావాలి” అని ఆయన పిలుపునిచ్చారు. మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు విశేషంగా స్పందించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore