Nellore: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణా తరగతులు

Nellore: మే 15 నుంచి 10 రోజుల పాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభం.

V. Narasimhulu, Nellore
Published on: 22 April 2026 2:22 PM IST
Nellore
X

Nellore: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణా తరగతులు

Nellore: మే 15వ తేదీ నుంచి 10 రోజులపాటు ఎస్ఎఫ్ఐ క్లాసులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎస్ఎఫ్ఐ నాయకులు.. నియంతృత్వానికి గాని, మతతత్వానికి గాని, యుద్ధానికి గాని వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అతి పెద్ద విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ..

విద్యార్థుల చిన్న చిన్న సమస్యల మీద కాదు, మొత్తం ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి, తీవ్రమైన నియంతృత్వ ధోరణలను వ్యతిరేకించడం అనేది ఎస్ఎఫ్ఐ ప్రధాన బాధ్యతగా పెట్టుకున్నదని చెప్పారు.. అందుకనే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకులను, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ నాయకులను జైల్లో పెట్టడం జరిగిందని అన్నారు.

అలాగే ఈరోజు ప్రపంచమంతా ట్రంప్ దుర్మార్గానికి బలైపోతుందని.. తెల్లవారితే ఏం జరుగుతుందో ఎవరి మీద ఏ బాంబు పడుతుందో అని భయపడుతున్నాం.. ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తమ గొంతును విద్యార్థుల నుంచి వినిపించేటువంటి అతిపెద్ద విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని చెప్పారు. రాష్ట్రంలో కూడా దాదాపు విద్యారంగం ప్రైవేటుపరం అయిపోయిందని.. మరీ హయ్యర్ ఎడ్యుకేషన్ కైతే ఈమధ్య గేట్లు తెరిచి.. ఎక్కడెక్కడో ఉన్న విద్యాసంస్థల్ని రాండి.. వందల ఎకరాలు తీసుకోండి అని, పిలిచి పిలిచి భూముల్ని పంచి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని గొప్ప నగరంగా తీర్చి దిద్దుతామని చెప్పే ప్రభుత్వం , కనీసం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం గానీ , కనీసం ప్రభుత్వ పాఠశాల గాని ఒకటైనా ఉందా అని అన్నారు..

సింగపూర్ కి మంత్రులు వెళ్లి చూసి వచ్చారని.. అక్కడ సింగపూర్ యూనివర్సిటీని చూచి రండి.. గొప్ప యూనివర్సిటీగా ఉండే సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉందని.. మరి సింగపూర్ తరహాలో అమరావతిని నిర్మిస్తామన్నప్పుడు, ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం కూడా ప్రభుత్వం తరపున ఎందుకు లేదని ప్రశ్నించారు.. నాకు తెలిసి ఈ ప్రశ్న ఒక్క ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మాత్రమే వేయగలరని, వాళ్ల ఆలోచన స్థాయిని పెంచడానికి, కొత్త విషయాలని అవగాహన చేయడానికి, మారుతున్న ప్రపంచపు పోకడల్ని అర్థం చేసుకునేటట్టుగా చేయడం కోసమే, ప్రతి సంవత్సరం వాళ్ళు శిక్షణా తరగతులు పెట్టుకుంటారని చెప్పారు..

అన్ని విశ్వవిద్యాలయాల నుంచి , అన్ని కళాశాల నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళు, దాదాపు 3 నుంచి 400 మందికి పైగా వచ్చి ఇక్కడ పది రోజులు పాటు క్లాసులు పెట్టుకుంటున్నారు అంటే చాలా గొప్ప విషయం అని అన్నారు.. ఈ శిక్షణా తరగతులు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని, వాళ్లకు కావాల్సినటువంటి అన్ని సహాయ సౌకర్యాలు అందిస్తామని చెప్పారు ..ఈ క్లాసులు వల్ల ఇప్పటి తరానికి ఒకప్పుడు సీతారాం ఏచూరి ఎలాగైతే ఎస్ఎఫ్ఐ నాయకుడి నుంచి.. దేశానికి తలమానికంగా ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా అవతరించాడో.. ఆ రకంగా ప్రతి ఎస్ఎఫ్ఐ కార్యకర్త దేశానికి ఉపయోగపడే నాయకులుగా ఎదగాలని ఆశపడుతున్నట్లు చెప్పారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story