AS Peta: మురికిగుంటలుగా మారిన రోడ్లు: గండువారిపల్లె ప్రజల తీవ్ర అవస్థలు

AS Peta: ఏఎస్ పేట మండలం గండువారిపల్లెలో సైడ్ కాలువలు లేక రోడ్లపైనే మురుగు నీరు నిలిచి గుంతలు పడటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 12 Sept 2026 3:23 PM IST
AS Peta
X

AS Peta: మురికిగుంటలుగా మారిన రోడ్లు: గండువారిపల్లె ప్రజల తీవ్ర అవస్థలు

నెల్లూరు జిల్లా: ఏ ఎస్ పేట మండల కేంద్రం పంచాయతీ పరిధిలో ఉన్న గండువారిపల్లె మజర గ్రామంలో గత కొంతకాలంగా రోడ్లపై మురికి నీరు పారుతుంది. దాంతో నడిరోడ్లు పై మురికి గుంతలు ఏర్పడ్డాయి. ఆ మార్గాల్లో పాదచారులు ద్విచక్ర వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

ఎక్కువ రోజులు మురికి నీరు నిలవ ఉండడంతో దుర్గంధం వెదజల్లి దోమలు నిలయాలుగా మారుతున్నాయి. సైడ్ కాలువలు నిర్మించకపోవడంతో ఇళ్లలోని నీళ్లు కొళాయి నీళ్లు రోడ్లపై పారుతున్నాయని అనేక పర్యాయాలు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వా పోతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని వెంటనే మురికి గుంతలు తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)