Atmakur: సీఐ గంగాధర్‌ను కలిసిన విజిలెన్స్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్!

Atmakur: ఆత్మకూరు సిఐ గంగాధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజిలెన్స్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నందుకు అభినందనలు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 1 Sept 2026 10:37 AM IST
Atmakur
X

Atmakur: సీఐ గంగాధర్‌ను కలిసిన విజిలెన్స్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్!

Atmakur: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్ ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మొదటగా స్వాతంత్ర దినోత్సవం రోజున సిఐ గంగాధర్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ అజిత వేజెండ్ల సమక్షంలో ఉత్తమ సేవ పురస్కారం అందుకున్నందుకు గాను వారికి శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.

ప్రధమంగా సర్కిల్ పరిధిలోని ప్రతి నెల చివరి వారంలో ఎమ్మార్వో అధ్యక్షతన గ్రామాల్లో జరిగే పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమానికి ఎస్సైలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సిఐని కోరారు. అలాగే సర్కిల్ పరిధిలో పెండింగ్లో ఉన్న పోలీస్ కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని పరిష్కరించాలని కోరారు. అలాగే గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు పోలీసులకు మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని మరింత బలపరచారని కోరారు.

సర్కిల్ పరిధిలోని స్కూల్లో కాలేజీలలో విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం ద్వారా విద్యార్థులు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉందని శేషం సుదర్శన్ సీఐకి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్సై జంపానీ కుమార్, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)

Next Story