Nellore: అమ్మలా వడ్డించిన జయమ్మ.. ఆత్మకూరు ప్రభుత్వ దవాఖానాలో అన్నదానం
Nellore: ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాత్రివేళ ఉచిత భోజన పంపిణీ ప్రారంభం.
Nellore: అమ్మలా వడ్డించిన జయమ్మ.. ఆత్మకూరు ప్రభుత్వ దవాఖానాలో అన్నదానం
Nellore: ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండర్లకు రాత్రిపూట వేల కూడా ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. కంచి జయమ్మ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మానవ సేవయే మాధవ సేవగా భావించి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తోంది శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్. ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులు (అటెండర్స్) రాత్రి వేళల్లో భోజనం కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి, వారి కోసం ప్రత్యేకంగా ఉచిత భోజనం కార్యక్రమాన్ని కంచి జయమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు.
అమ్మలా వడ్డించిన జయమ్మ..
ఈ కార్యక్రమంలో భాగంగా కంచి పరమేశ్వర రెడ్డి సతీమణి శ్రీమతి కంచి జయమ్మ స్వయంగా పాల్గొని పేషెంట్ అటెండర్లకు భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, గతంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కడుపు నిండా భోజనం దొరుకుతున్నందుకు వారు వ్యక్తపరిచిన సంతోషాన్ని చూసి ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
కృతజ్ఞతలు తెలిపిన రోగుల బంధువులు..
భోజనం స్వీకరించిన అటెండర్లు తమ కృతజ్ఞతలు చాటుకున్నారు.గతంలో రాత్రి వేళల్లో భోజనం దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్లం. బయట హోటళ్లు మూసివేసినా, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొనుక్కోలేకపోయినా ఆకలితో ఉండాల్సి వచ్చేది మధ్యాహ్నమే కాకుండా, మా కష్టాన్ని గుర్తించి రాత్రి కూడా రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసిన కంచి పరమేశ్వర రెడ్డి కుటుంబానికి మేము రుణపడి ఉంటామని తెలిపారు.




