Nellore: నెల్లూరు రూరల్‌లో ₹40 లక్షలతో డాగ్స్ షెల్టర్ పనులకు శంకుస్థాపన

Nellore: నెల్లూరు రూరల్ 31వ డివిజన్ అక్కచెరువుపాడులో ₹40 లక్షలతో డాగ్స్ షెల్టర్ నిర్మాణానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 12 Sept 2026 3:59 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రూరల్‌లో ₹40 లక్షలతో డాగ్స్ షెల్టర్ పనులకు శంకుస్థాపన

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్ అక్కచెరువుపాడు నందు 40 లక్షల రూపాయలతో డాగ్స్ షెల్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక ప్రజలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

ప్రజా బాటలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజలు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలియజేయగా, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా డాగ్స్ షెల్టర్ ను ఏర్పాటు చేసి కుక్కల బెడద నుండి ప్రజలకు విముక్తి కలిగించే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 31వ డివిజన్ అభివృద్ధికి 8 కోట్ల 70 లక్షల రూపాయల నిధులు కేటాయించామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ప్రజలందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇంచార్జ్ పల్నాటి మస్తాన్ నాయుడు, టిడిపి నాయకులు బత్తల కృష్ణ, 31వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కూకటి హరిబాబు యాదవ్, టీడీపీ నాయకులు కొప్పోలు సురేష్ నాయుడు, కోటి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, ఖాదర్ భాష, టీ.వి.ఎస్. కమల్, సుధాకర్ నాయుడు, అమ్మినేని సుబ్బారావు, మల్లి, శేషారెడ్డి, మురళి, ఉమామహేశ్వరరావు, కూరపాటి హరి బాబు, మునాఫ్, అల్లం వెంకటేశ్వర్లు, అనిల్, షఫీ, దేవదాసు, దాసరి శ్రీనివాసులు, శ్రీనివాసలురెడ్డి, రాము, జున్ను, ఖాదర్ భాష, బాణాల మస్తానయ్య, సత్తాజ్, రమేష్, సుధా, నాగమణి, దొరసానమ్మ, మోబినా, కుమారి, మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE