Nellore: చెత్తలో రూ.1200 కోట్ల దోపిడీ: మంత్రి నారాయణపై ఎమ్మెల్సీ ఫైర్
Nellore: రాష్ట్రంలో మున్సిపల్ చెత్త ప్రాసెసింగ్ పేరిట రూ.1200 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.
Nellore: చెత్తలో రూ.1200 కోట్ల దోపిడీ: మంత్రి నారాయణపై ఎమ్మెల్సీ ఫైర్
Nellore: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో..వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ,వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు..
మొన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి.. ఈ రాష్ట్రంలో చెత్త విషయంలో జరిగిన అవినీతి గురించి.. తాము ఆధారాలతో సహా వెల్లడిస్తే మంత్రి నారాయణకు చీమకుట్టినట్టైనా లేదని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు...
జరిగిన 1200 కోట్ల అవినీతిపై.. మేము పూర్తి ఆధారాలతో వస్తాం మీడియా ముందు చర్చిద్దాం అంటే.. అర్థం పర్థం లేకుండా.. మంత్రి మాట్లాడుతున్నారని,
అదేమంటే వాళ్ల నేతలతో ప్రెస్ మీట్ లు పెట్టించి.. అసలు కాంట్రాక్ట్ 1200 కోట్లు కాదు 1190 కోట్లు..అని.. చెప్పించడం.. చూస్తుంటే తప్పును బుకాయించుకోవడంలా ఉందన్నారు.మాట్లాడితే మంత్రి నారాయణ.. నా పిల్లలు వెల్ సెటిల్డ్, నాకు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి.. అవినీతి ఎందుకు చేస్తాను అంటున్నారని, తప్పు జరగలేదు అని మంత్రి నారాయణ చెప్పలేకున్నారని చెప్పారు..
"చెత్త స్కామ్ లో 1200 కోట్ల కంటే ఎక్కువ అవినీతి దాగి ఉంది"
మీరు చెప్తున్నది లెగసీ వేస్ట్ మాత్రమే 1190 కోట్లు.. అయితే.. ఫ్రెష్ వెస్ట్,WTE ప్లాంట్స్,ట్రాక్టర్స్,కాంపాక్ట్ మిషన్స్, స్వీపింగ్ మిషన్స్, ప్రాసెసింగ్ యూనిట్స్ ఇలా అన్నింటి లోనూ దోపిడీ. షుమారు 2000 వేల కోట్లు రూపాయల అవినీతి ఈ స్కాంలో దాగి ఉందని, ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని అన్నారు..
"గత వైసిపి ప్రభుత్వం పై మోసపు మాటలు, పూర్తి అబద్దాలతో నిందలు. ఈ పేరుతో 1200 కోట్ల దోపిడీ"
మాటకొస్తే మంత్రి నారాయణ, చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వం చెత్త ను తొలగించడానికి చెత్త పన్ను వేసి 85 లక్షల టన్నుల వేస్ట్ చెత్తను వదిలి వెళ్ళిందని ప్రారంభించి 163 లక్షల టన్నులకు పెంచుకుంటూ పోయారని మాట్లాడుతున్నారు..ఇదంతా ప్రభుత్వం చెప్తున్న మోసం, అబద్ధం. పైగా ఇదే చెత్త పేరుతొ 1200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని నిరూపించేందుకు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. మీరు చర్చిస్తాము అంటే ఎప్పుడైనా రావడానికి సిద్ధం అని అన్నారు...
"మీ అవినీతి పై మేము అడిగిన 12 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా .?
మొన్నటి రోజున మేము అడిగిన 12 ప్రశ్నలకు.. సమాధానం చెప్పలేక మంత్రి నారాయణ ముఖం చాటేశారని,తాము ఒకటే అడుగుతున్నామని, మీరు ప్రజల సొమ్మును.. జవాబుదారీతనం లేకుండా.. ఎలా ఇష్ట రాజ్యంగా ఖర్చు పెడతారని అడుగుతున్నాం.సిల్ట్, లెగసి వేస్ట్, రోడ్స్, ఈ కాంట్రాక్టులన్నీ మీ బినామీలకు కట్టబెడుతున్నది వాస్తవం కాదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
"చెత్త కుంభకోణం పై సిబిఐ విచారణ జరగాలి"
రాష్ట్రంలో జరుగుతున్న ఈ చెత్త.. కుంభకోణంపై సిబిఐ ఎంక్వయిరీ వేయాలి. DSC మీద.. మీరు చర్చకు సిద్ధమా.. మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి.అంతకుముందే ఈ చెత్త స్కాం.. పై మీడియా ముందు బహిరంగ చర్చకు రావాలన్నారు.
"గతంలో మంత్రి నారాయణ చేపట్టిన పనుల్లో భారీ అవినీతి"
"VR హై స్కూల్ పేరుతొ 10 కోట్ల మున్సిపల్ నిధుల స్వాహా కు ప్రణాళిక. మేము గట్టిగా ప్రశ్నిస్తే వెనుకంజ"
గతంలో VR మున్సిపల్ హై స్కూల్.. విషయంలో జరుగుతున్న అవినీతిని వైఎస్ఆర్సిపి అడ్డుకుంది. చెట్లు విషయంలో అలాగే జరిగింది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజం.. అనే విధంగా మంత్రి నారాయణ వ్యవహరిస్తున్నారు. వి ఆర్ హై స్కూల్ అభివృద్ధికి మొదట సి ఎస్ ఆర్ ఫండ్స్ 15 కోట్లు అన్నారు. తర్వాత ఐదు కోట్లు నా సొంత నిధులు అన్నారు.. ఇలా మొత్తం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
ఈ క్రమంలో మున్సిపల్ నిధుల నుంచి 10 కోట్ల రూపాయల ను డ్రా చేసేందుకు ఆమోదం తీసుకున్నారు. గట్టిగా ప్రశ్నించేటప్పటికి draw చేయకుండా వెనుకడుగు వేశారని చెప్పారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద 8500 కోట్లతో 38వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చేస్తే, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ దానిని మూలన పెట్టి ఒక్క రూపాయి పని కూడా చేయడం లేదని చెప్పారు..
ఆరోజు నాడు నేడు ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 38వేల ప్రభుత్వ పాఠశాలను ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు.. ప్రణాళిక రూపొందించి 8500 కోట్ల రూపాయలతో 80% పనులు పూర్తి చేసిందని గుర్తు చేశారు.
మీరు బడ్జెట్లో మనబడి మన భవిష్యత్తు కింద 1500 కోట్లు కేటా ఇస్తామన్నారు అందరూ సంతోషించాం. కానీ ఇంతవరకు చిల్లిగవ్వ.. ఆ పథకానికి కేటాయించలేదు. ఈ రాష్ట్రంలో నాడు నేడు కింద 80% స్కూల్స్ లో పనులు జరిగి ఉన్నాయి. మిగిలిన పనుల గురించి ఎక్కడ పట్టించుకోకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మీరు CSR ఫండ్స్ పేరుతో దోపిడీకి.. పాల్పడ్డారా లేదా సమాధానం చెప్పాలి. VR హై స్కూల్ అభివృద్ధికి 15 కోట్లు CSR ఫండ్స్ ఖర్చు చేస్తున్నామని చెప్పి.. మళ్లీ అదనంగా 10 కోట్ల రూపాయలను.. నగరపాలక సర్వసభ్య సమావేశంలో అజెండా లో పెట్టి ఆమోదించుకున్న మాట వాస్తవం కాదా చెప్పాలన్నారు..
"సమాధానం చెప్పని కమీషనర్"
దీనిపై తాము కమిషనర్ ను ప్రశ్నిస్తే.. కమిషనర్ నాకేం సంబంధం అంటారు. అంతేకాకుండా విఆర్ స్కూల్ ప్రారంభోత్సవానికి లోకేష్ వస్తే.. ఆయన మీటింగ్ అని చెప్పి.. 54 లక్షల రూపాయల బిల్లులను నగరపాలక సంస్థ జనరల్ ఫండ్స్ నుంచి డ్రా చేయడానికి అనుమతులు తీసుకున్నారా లేదా సమాధానం చెప్పాలన్నారు.
పేదవాడి వద్ద నుంచి.. వారి రక్తం పిండి వసూలు చేసే.. పన్నులను.. ఈ విధంగా దోచుకోవడం ఏంటో మంత్రి నారాయణ సమాధానం చెప్పాలన్నారు.
"చెట్టుకి 12000 విషయంలో భారీ అవినీతి చేయడానికి అనుమతులు తీసుకున్నారు.."
అలాగే చెట్ల గురించి కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు అన్నారు. ఒక్కో చెట్టు నాటేందుకు ఐదు వేల రూపాయలకు అంచనాలు రూపొందించింది వాస్తవం కాదా.. వాటి నిర్వహణ కోసం మరో 7000 వేల కు ఎస్టిమేషన్స్ వేసింది వాస్తవం కాదా.. సమాధానం చెప్పాలన్నారు. ఎప్పుడైతే దీనిపై నేను ప్రశ్నించానో.. అప్పుడు యూటర్న్ తీసుకొని.. కేవలం అంచనాలు మాత్రమే రూపొందించామని జారుకునే ప్రయత్నం చేశారు. 7-02-2026 న జరిగిన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో చెట్లు నాటేందుకు 11 డివిజన్ 50 లక్షలు, 13 డివిజన్ లో 50 లక్షలు, 15 డివిజన్ లో 20 లక్షలు, 6 డివిజన్ 12 లక్షల 50,000 వేలు, 3 డివిజన్ 26 లక్షలు, 5 డివిజన్ లో 22 లక్షల 50 వేలు, 4వ డివిజన్ 38 లక్షలు, 53 డివిజన్ లో 30 లక్షలు.. ఇలా అనుమతులు తీసుకున్న మాట వాస్తవం కాడా అని ప్రశ్నించారు. అడిగితే మేము అనుమతులు తీసుకున్నా డ్రా చేయ లేదు కదా.. అని చెప్తున్నారు . ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా అని అన్నారు.
"అవినీతి పై పిట్ట కథ"
దోచుకు తినడానికి సిద్ధమైన వ్యక్తి .. సొమ్మంత మూట కట్టుకొని.. అందరూ అరిచేటప్పటికి నేనింకా.. ఎత్తుకుపోలేదు కదా అని చెబితే ఎవరూ నమ్ముతారు.
అసలు మున్సిపల్ జనరల్ ఫండ్స్ ను స్కూల్స్కు ఎందుకు ఖర్చు పెట్టాలి. గత ప్రభుత్వంలో మున్సిపల్ పాఠశాలలను స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేసి.. నేరుగా ప్రభుత్వం నుంచే నిధులు విడుదల చేయించి ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు మున్సిపల్ స్కూల్స్ .. అభివృద్ధికి.. మునిసిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి ఖర్చు చేయడం.. విడ్డూరమన్నారు.
"మనబడి మన భవిష్యత్ పథకానికి.. నిధులు ఎక్కడ"
మీరు మనబడి మన భవిష్యత్తు.. కు బడ్జెట్లో 1200 కోట్లు కేటాయించి.. ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా సమాధానం చెప్పండి. ఈరోజు అభివృద్ధి పేరుతో మున్సిపల్ హై స్కూళ్ళ లో ఇష్ట రాజ్యాంగా నిధులు ఖర్చు చేస్తు.. దోచుకుంటున్నారు. BVS మున్సిపల్ పాఠశాలకు మొదట 50 లక్షలు, తర్వాత 50 లక్షలు, అనంతరం 36 లక్షలు.. కు అప్రూవల్స్ తీసుకొని.. దీనిపై ప్రశ్నించేసరికి.. తూచ్ అంత సిఎస్ఆర్ ఫండ్స్.. అని.. మభ్యపెడుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్ లో ఇష్టారాజ్యంగా దోపిడీ. వేసిన సిమెంటు రోడ్లను మళ్లీ..పగలగొట్టి ఎండ్ టు ఎండ్ రోడ్స్ పేరుతో.. అవినీతి చేస్తున్నారు.
"మేము విసిరిన సవాలు స్వీకరించి ఇప్పటికైనా చర్చకు రావాలి"
ఇప్పటికైనా మంత్రి నారాయణ చెత్త విషయంలో జరిగిన 1200 కోట్ల రూపాయల అవినీతికి ప్రజలు ముందుకొచ్చి సమాధానం చెప్పాలి. లేదంటే రాబోయే రోజుల్లో మీ అవినీతిని.. ప్రజలకు తెలిసేలా వైఎస్ఆర్సిపి పోరాటం చేస్తుంది.
"కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ :--
చెత్త విషయంలో జరిగిన అవినీతి.. విషయంలో బహిరంగ చర్చకు మంత్రి నారాయణను పిలిస్తే.. నారాయణ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని, 1200 కోట్ల అవినీతి అని మేము చెబితే అసలు ఇచ్చింది 1190 కోట్లే కదా అంటున్నారు... అంటే అవినీతి జరిగిందని మీరు ఒప్పుకున్నట్టే కదా. దీనిపై మంత్రి నారాయణ సమాధానం చెప్పకుండా మాకు పనుందని తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే.. మేము విసిరిన సవాలును స్వీకరించి..బహిరంగ చర్చకు రావాలని మంత్రి నారాయణను.. హెచ్చరించారు.CSR ఫండ్స్ పేరుతో.. మంత్రి నారాయణ చేస్తున్నవన్ని అవినీతి అక్రమాలే. మీ అక్రమాలను రాబోయే రోజుల్లో.. ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండ కడతామని హెచ్చరించారు.




