Atmakur: ఆర్డీఓ కార్యాలయం ముందు అప్పారావుపాలెం ఎస్సీ కాలనీ ప్రజల ఆందోళన
Atmakur: ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం ఎస్సీ కాలనీ ప్రజలు ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించి, వర్క్ ఆర్డర్ ప్రకారమే సీసీ డ్రైనేజీ పనులు చేపట్టాలని కోరారు.
Atmakur: ఆర్డీఓ కార్యాలయం ముందు అప్పారావుపాలెం ఎస్సీ కాలనీ ప్రజల ఆందోళన
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ నిధులతో మంజూరైన సీసీ డ్రైనేజీ పనులను ఆమోదించిన వర్క్ ఆర్డర్‌కు విరుద్ధంగా చేపట్టే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేసి, వర్క్ ఆర్డర్‌లో పేర్కొన్న ప్రాంతంలోనే పనులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అప్పారావుపాలెం ఎస్సీ కాలనీ ప్రజలు ఆత్మకూరు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రూరల్ అధ్యక్షుడు తోడేటి ఆశోక్ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)కు వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా అమలు కావాలని గ్రామ ప్రజలు కోరారు. డ్రైనేజీ పనుల మార్పు వల్ల గ్రామంలో అనవసర వివాదాలు, ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.అలాగే, వర్షాకాలంలో వర్షపు నీరు ఎస్సీ కాలనీ వైపు మళ్లే ప్రమాదం ఉందని, దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారమే పనులు చేపట్టాలని, మార్పులు చేస్తే కాలనీ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు.వర్క్ ఆర్డర్‌లో ఆమోదించిన విధంగానే సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు జరిగేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్డీఓను కోరారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్,మాతంగి మాధవ,గొర్రెపర్తి పెంచలయ్య, గొర్రెపర్తి సంపూర్ణ,కటారి దుర్గా, మాతంగి అశోక్ తదితరులు ఉన్నారు.




