Rapur: ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి అన్నదానం చేసిన వైఎస్సార్‌సీపీ!
Rapur: నెల్లూరు జిల్లా రాపూరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి అన్నదానం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
Rapur: ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి అన్నదానం చేసిన వైఎస్సార్‌సీపీ!
Rapur: నెల్లూరు జిల్లా రాపూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను వైఎస్సార్ సీపీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించాయి.రాపూరు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నారాయణ రెడ్డి, నరసింహారెడ్డితో పాటు భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాపూరు గ్రంథాలయం సెంటర్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను,పేదల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన పథకాలను గుర్తుచేసుకున్నారు.
దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.ఈ సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.




