Rapur: రాపూరులో పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు భారీ అన్నదానం!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరులో జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి, 200 మందికి అన్నదానం చేసిన జనసేన నాయకులు.

Yellayya, Nellore
Published on: 3 Sept 2026 11:42 AM IST
Rapur
X

Rapur: రాపూరులో పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు భారీ అన్నదానం!

Rapur: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని బాలాజీ కంప్లెక్స్ దగ్గర ఉత్సాహంగా సాగాయి. జనసేన పార్టీ మండల నాయకులు రాజేష్ జల్లెల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.

భారీ ఎత్తున బాణా సంచా పేల్చుతూ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్టింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జై జనసేన అనే నినాదాలతో హోరేత్తించారు.ఈ సందర్బంగా సుమారు 200 మందికి అన్నదానం నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Yellayya, Nellore

Yellayya, Nellore

Next Story