Rapur: రాపూరు ఆర్టీసీ డిపోలో మెగా వైద్య శిబిరం ప్రారంభం
Rapur: రాపూరు ఆర్టీసీ డిపోలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి. ప్రయాణికులు, సిబ్బంది ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు.
Rapur: రాపూరు ఆర్టీసీ డిపోలో మెగా వైద్య శిబిరం ప్రారంభం
రాపూరు: ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో జిల్లా ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా రాపూరు ఆర్టీసీ బస్టాండ్ లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరంలో ఆర్టీసీ సిబ్బంది,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాము.
ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు ఆర్టీసీ డిఎం అనిల్ కుమార్,ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story




