Rapur: మద్దెలమడుగు గోపాలకృష్ణ స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

Rapur: రాపూరు మద్దెలమడుగు రాధా సమేత గోపాలకృష్ణ స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, భక్తులకు భారీ అన్నసంతర్పణ.

Yellayya, Nellore
Published on: 4 Sept 2026 4:35 PM IST
Rapur
X

Rapur: మద్దెలమడుగు గోపాలకృష్ణ స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు మద్దెలమడుగు సెంటర్‌లో వేంచేసియున్న రాధా సమేత గోపాలకృష్ణ స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.

ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని, స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దర్శనానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ శశి రెడ్డి తమ సొంత నిధులతో భక్తుల కోసం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

భక్తుల గోవింద నామస్మరణలు, శ్రీకృష్ణుని కీర్తనలతో మద్దెలమడుగు సెంటర్ ప్రతిధ్వనించింది. వేడుకల్లో స్థానిక ప్రజలు, ఆధ్యాత్మికవేత్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులకు శ్రీకృష్ణుని సందేశాన్ని, భగవద్గీత సారాంశాన్ని వివరిస్తూ, నిత్య జీవితంలో స్వామివారి బోధనల ప్రాముఖ్యతను గుర్తుచేశారు.

Yellayya, Nellore

Yellayya, Nellore

Next Story