Podili: పొదిలి కోర్టులో జాతీయ లోక్ అదాలత్.. 1,378 కేసులు పరిష్కారం!

Podili: పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం. 1,378 కేసులు పరిష్కారం, కక్షిదారులకు రూ.44.75 లక్షల పరిహారం అందజేత.

MADARVALI, MARKAPURAM
Published on: 13 Sept 2026 9:48 AM IST
Podili
X

Podili: పొదిలి కోర్టులో జాతీయ లోక్ అదాలత్.. 1,378 కేసులు పరిష్కారం!

Podili: పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ లోక్ అదాలత్ నిర్వహించినట్లు సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎం.ఎస్.వి. శ్రీ ప్రత్యూష తెలిపారు.

ఈ జాతీయ లోక్ అదాలత్‌లో వివిధ రకాల కేసులను పరిష్కరించారు. ఇందులో 52 ఐపీసీ కేసులు, 5 ఎన్‌ఐ యాక్ట్ కేసులు, 5 సివిల్ మనీ కేసులు, 3 పర్మనెంట్ ఇంజంక్షన్ కేసులు, 10 ఈపీ కేసులు, 2 మెయింటెనెన్స్ కేసులు, 1 డీవీసీ కేసు, 1,300 ఎస్‌టీసీ కేసులు కలిపి మొత్తం 1,378 కేసులను పరిష్కరించారు.

పరిష్కరించిన కేసులకు సంబంధించి కక్షిదారులకు మొత్తం రూ.44,75,000 పరిహారాన్ని అందజేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సత్వరంగా పరిష్కరించుకోవడంతో పాటు ఇరుపక్షాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM