Podalakuru: మహమ్మదాపురంలో ఉచిత మొబైల్ న్యూరో వైద్య శిబిరం

Podalakuru: మహమ్మదాపురంలో ఎనెల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత న్యూరో వైద్య శిబిరం జరిగింది. పక్షవాత లక్షణాలు కనిపిస్తే తొలి 4.5 గంటలు కీలకమని వైద్యులు తెలిపారు.

Yellayya, Nellore
Published on: 12 Sept 2026 2:33 PM IST
Podalakuru
X

Podalakuru: మహమ్మదాపురంలో ఉచిత మొబైల్ న్యూరో వైద్య శిబిరం

నెల్లూరు జిల్లా: పొదలకూరు మండలం మహమ్మదాపురంలో ఉచిత మొబైల్ న్యూరో వైద్య శిబిరం నిర్వహించారు. నెల్లూరులోని ఎనెల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో గ్రామీణులకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించారు.

పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే స్పందించాలని న్యూరాలజిస్ట్ డాక్టర్ లావణ్య సూచించారు. ముఖ్యంగా తొలి నాలుగున్నర గంటల గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేరిస్తే మెరుగైన చికిత్సతో ప్రాణాపాయం, వైకల్యాన్ని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు.

మాట తడబడటం, మూతి వంకర పడటం, చేతులు కాళ్లలో చలనం తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. నాటు మందుల వైపు వెళ్లకుండా, వైద్యుల సూచన మేరకు మందులు క్రమం తప్పకుండా వాడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఉచిత మొబైల్ న్యూరో శిబిరాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Yellayya, Nellore

Yellayya, Nellore