Nellore: పెన్నా నదిలో డ్రైనేజీ మట్టి.. ఆలయ జలాలు అపవిత్రం: మిడతల రమేష్!

Nellore: శ్రీ రంగనాథస్వామి ఆలయం వెనుక పెన్నా నదిలో మున్సిపల్ డ్రైనేజీ మట్టిని పోస్తూ నదిని ఆక్రమించడంపై బీజేపీ నమామి గంగే కన్వీనర్ మిడతల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 18 Aug 2026 10:34 PM IST
Nellore
X

Nellore: పెన్నా నదిలో డ్రైనేజీ మట్టి.. ఆలయ జలాలు అపవిత్రం: మిడతల రమేష్!

నెల్లూరు: నెల్లూరు రంగనాథ స్వామి ఆలయం , వెనుక భాగంలో పార్కు నుండి పెన్నా నదిని, మున్సిపల్ అధికారులు మట్టితో కట్టేస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్.

డ్రైనేజీ కాలువల మురికి మట్టిని పోసిన ప్రాంతాన్ని మిడతల రమేష్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పెన్నా నదిని ఆక్రమణలు చేయడమే తప్పని, పెన్నా నదీ జలాల లో మురికి నీరు చేరడంతో ఆలయంలో తీర్థ ప్రసాదం అపవిత్రంగా మారుతుందని స్వామి వారి భక్తులు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు.

భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మున్సిపల్ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని పెన్నా నది జలాలు కలుషితం మరియు నదిని ఆక్రమించడంపై పెన్నా డెల్టా ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి దృష్టికి బిజెపి నేత మిడతల రమేష్ తీసుకువెళ్లారు. వెంటనే సంబంధిత అధికారులు అందరూ స్పందించి డ్రైనేజ్ మురికిని నివారించని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేస్తామని రమేష్ తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story