Nellore: జనావాసాల మధ్య నెమలి అటవీ శాఖకు అప్పగింత!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో అరుదైన నెమలి ప్రత్యక్షమైంది.

Madhav Goud, Nellore
Published on: 5 Aug 2026 7:02 PM IST
Nellore
X

Nellore: జనావాసాల మధ్య నెమలి అటవీ శాఖకు అప్పగింత!

నెల్లూరు: నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రమైన బస్టాండ్లో లో అడవుల్లో ఉండాల్సిన నెమలి జనాల మధ్య తిరగడం అందరిని ఆశ్చర్యపరిచింది ,

అడవుల్లోనూ.. జలాశయాల ఎగువ భాగం కనుమల్లోనూ.. అరుదుగా కనిపించే నెమలి పురవీధుల్లో పురివిప్పి నాట్యం ఆడుతూ... ప్రత్యక్షమైంది... అందునా నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ లో, తన సోయగాలతో జనాల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.. ఇది చూసిన జనం ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.

ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే నెమలి కనుల ముందు ప్రత్యక్షం కావడంతో, ఆనందంతో తిలకించారు... జనాల మధ్య నెమలి కనిపించడంతో అందరూ ఆనంద పరవశులయ్యారు.. ఈ అరుదైన దృశ్యం నెల్లూరు జిల్లా, కలువాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది.

ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు గానీ, నెమలి జనావాసాల మధ్యకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు... కొందరు యువకులు ఆ నెమలిని సురక్షితంగా పట్టుకొని, పోలీసుల సమక్షంలో, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.. బస్టాండ్ లో కనిపించిన నెమలిని చూసేందుకు జనం ఎగబడడమే కాదు.. ఈ అందమైన దృశ్యాన్ని తమ ఫోన్లలో తీసి భద్రపరుచుకున్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story