Nellore: ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం
Nellore: ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా పాలగొల్లు విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు.
Nellore: ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం
నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా పాలగొల్లు విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్మన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులకు మరింత మెరుగైన సేవలు అందేలా మార్కెట్ కమిటీ పని చేయాలని ఆకాంక్షించారు.నూతన చైర్మన్ పాలగొల్లు విజయలక్ష్మి తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.




