Nellore: హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పై.. ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి వినతిపత్రం

Nellore: నెల్లూరులో జూనియర్ కాలేజీల అనుమతుల్లో G.O.114 మరియు హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించారంటూ PAAP ఆందోళన.

V. Narasimhulu, Nellore
Published on: 12 Jun 2026 11:27 AM IST
Nellore
X

Nellore: హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పై.. ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి వినతిపత్రం

Nellore: జూనియర్ కాలేజీల స్థాపన అనుమతులు మంజూరు లో G.O.114 మరియు హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన వ్యవహారాన్ని నిరసిస్తూ.. జూనియర్ కాలేజీల స్థాపన అనుమతులు మంజూరు లో G.O.114 మరియు హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన ల పై ఈ రోజు The Parents Association of Andhra Pradesh (PAAP), నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్‌మీడియట్ ఎడ్యుకేషన్ రీజినల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ (RIO)కి వినతి పత్రం సమర్పించారు.

ఈ వినతిలో G.O.Ms.No.114, Higher Education (CE-III-2) Department, dated 09-08-2000 మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు లను ఉదహరిస్తూ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జూనియర్ కాలేజీలను అనధికారికంగా అనుమతించడాన్ని తీవ్రంగా ఖండించారు.

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న జూనియర్ కాలేజీల నుండి కనీసం 2 కి.మీ. దూరం ఉండాలని G.O. మరియు హైకోర్టు తీర్పులో స్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ నిబంధనలను ఉల్లంఘించి నెల్లూరు నగరంలో కొత్త జూనియర్ కాలేజీ(ల)కు అనుమతి ఇవ్వడం జరిగింది.

ఇది హైకోర్టు తీర్పును నేరుగా అతిక్రమించడమే కాక, విద్యా వ్యవస్థపై వాణిజ్య దృక్పథాన్ని ప్రోత్సహించడం మరియు విద్యార్థులు, తల్లిదండ్రులకు నష్టం కలిగించడం. సమస్య ఉన్న ప్రాంతాల్లో బ్యాలెన్స్‌డ్ విద్యా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యాన్ని ఈ అనుమతులు ధ్వంసం చేస్తున్నాయి.

వినతిలో కోరిన అంశాలు:

-అనుమతులపై తక్షణం విచారణ చేపట్టి, భౌతిక పరిశీలన & దూరం కొలతలు నిర్వహించాలి.

-2 కి.మీ. పరిధిలో ఉన్నట్టు తేలితే అనుమతులను సస్పెండ్ చేసి, రద్దు చేయాలి.

-15 రోజులలోపు చర్యలు తీసుకున్న వివరాలను అసోసియేషన్‌కు అందించాలి.

-ఏ చర్యలు తీసుకోకపోతే, అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించి కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు కూడా దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నరహరి శిఖరం జిల్లా అధ్యక్షులు కార్యదర్శి కోట శ్రీనివాసుల రెడ్డి ఉడుత రాజశేఖర్ యాదవ్,షేక్ అబ్దుల్ మునాఫ్ పగడాల రాజేష్ కే మల్లికార్జున్,పి శివ కుమార్ షేక్ నిహాల్ తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story