Nellore: సాగునీటి కోసం కదం తొక్కిన నెల్లూరు రైతాంగం: బ్యారేజీ వద్ద ఉద్రిక్తత!

Nellore: శ్రీశైలం నుంచి సోమశిలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో నెల్లూరు బ్యారేజీ వద్ద రైతులు మహాధర్నా చేపట్టారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 8 Sept 2026 7:51 PM IST
Nellore
X

Nellore: సాగునీటి కోసం కదం తొక్కిన నెల్లూరు రైతాంగం: బ్యారేజీ వద్ద ఉద్రిక్తత!

నెల్లూరు జిల్లా: రైతాంగానికి, ప్రజానీకానికి శ్రీశైలం నుండి సోమశిల కు నీరు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, సాగునీరు, తాగునీరు అందించడంలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ,మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ గారు, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గం పరిశీలకులు వీరి చలపతి, రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి ,జిల్లాలోని వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధిక సంఖ్యలో తరలివచ్చిన రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నెల్లూరు బ్యారేజీ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి నెల్లూరు బ్యారేజ్ వరకు 100 కార్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు... బ్యారేజ్ వద్ద భారీగా మోహరించి రైతులను, వైఎస్ఆర్సిపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి రైతులు నాయకులతో కలిసి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.

కాకాణి గోవర్ధన్ రెడ్డి.. బ్యారేజ్ సందర్శనకు పోలీసులు అనుమతించకపోవడంతో రైతులు,వైఎస్ఆర్ సీపీ నాయకులతో కలిసి పోలీసులను నెట్టుకొని వెళ్లి బ్యారేజ్ ను సందర్శించారు కాకాణి తదితరులు ప్రజలు అందరూ వెళ్లే ప్రధాన రహదారిలోనే వెళ్తున్న తమను నిరోధించడంపై కాకాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీశైలం నీటిని సోమశిల జలాశయానికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు..జిల్లా రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు బ్యారేజ్ వద్ద నిరసన దీక్షపై ముందస్తుగా ఎస్పీ కి సమాచారమిచ్చామని, రైతులను,వైఎస్ఆర్ సీపీ నేతలను నిరోధించడానికే పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని అన్నారు... నెల్లూరు బ్యారేజ్ వద్దకు వెళ్తే, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతో మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పారు.

చంద్రబాబు పాలనలో రైతాంగానికి ఎప్పుడూ కష్టాలేనని, చంద్రబాబు, కరువు, కవల పిల్లలు అని, తీవ్రమైన ఎండలు, సాగునీటి కొరతకు చంద్రబాబు పాదమే కారణం అని అన్నారు. శ్రీశైలంలో నీరున్నా సోమశిలకు నీటిని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు...?

ఇరిగేషన్ నిపుణులమని చెప్పుకునే జిల్లా నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు విప్పరు? అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెబ్‌సైట్‌లో జలాశయాల నీటిమట్టం వివరాలను సెప్టెంబర్ 2 నుంచే దాచిపెట్టారని చెప్పారు. ప్రస్తుతం సోమశిలలో 17 టీఎంసీలు, కండలేరులో 18 టీఎంసీలు మాత్రమే నీరు ఉన్నాయని కాకాణి వెల్లడించారు.

నెల్లూరు డెల్టా రైతులకు వెంటనే సాగు, తాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. జలాశయాల్లో నీరున్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోతున్నాయని, కలువాయి మండలం కనుపూరుపల్లి, నూకనపల్లి, యదనపర్తి, వెరుబొట్లపల్లి, గోపవరం తదితర గ్రామాల్లో 3,600 నుంచి 4,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.. సోమశిల - కండలేరు ఫ్లడ్ కెనాల్ ద్వారా ఒక్క రోజు నీటిని విడుదల చేసినా చెరువులు నిండుతాయని చెప్పారు.

నెల్లూరు డెల్టా పరిధిలోని రైతులకు నీటి యాజమాన్య హక్కులు (రైపేరియన్ రైట్స్) ఉన్నాయని చెప్పారు.. పురుగుల మందు డబ్బాలతో పంటలు ఎండిపోతున్నాయంటూ రోడ్డెక్కుతున్న రైతుల గోడు వినాలని, వెంటనే శ్రీశైలం నుంచి నీటిని తరలించాలని, నీరు విడుదల చేయకపోతే .. పంటలు ఎండిపోవడం అనివార్యం అని అన్నారు.

ఇలాంటి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత ఉందో లేదో ప్రజలే ఆలోచించాలని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రత్యామ్నాయ పంటలు, తాగు, సాగునీటిపై సమీక్షలు ఏవి? అని ప్రశ్నించారు.

సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు... రైతులకు లబ్ధి శూన్యం.. రైతుల పేరిట దొంగ బిల్లులతో ఇరిగేషన్‌లో దోచుకోవడానికే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పారు.

నెల్లూరు బ్యారేజ్ ప్రాజెక్టు కు వైఎస్సార్ పునాది వేస్తే.. జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేశారని తెలిపారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరును బ్యారేజ్ నుంచి తొలగించడాన్ని ఖండించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సంగం బ్యారేజ్ పేరు తుడిచివేసి పెయింట్లు వేయడం దారుణం అని అన్నారు.. కొత్త ప్రాజెక్టులు కట్టే ధైర్యం లేక, మహనీయుల పేర్లు తొలగించడానికే జీవోలు ఇస్తున్నారని చెప్పారు..

కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు భయపడేది లేదని చెప్పారు.. ప్రశ్నించే మీడియా సంస్థలు, ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. కోవూరులో ఫోర్త్ ఎస్టేట్ సీఈఓ శ్రావణ్‌పై పెట్టింది అక్రమ కేసే అని, అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పారు...

రేపు తప్పుడు కేసులు అని రుజువైతే కేసు పెట్టిన వారిని,చంద్రబాబు, లోకేష్ కాపాడలేరని చెప్పారు. సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధారాలతో సహా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని కోరారు.

తెలంగాణ నీటిని తరలించుకుపోతున్నా చంద్రబాబు పట్టించుకోకుండా పక్క రాష్ట్రానికి ఊడిగం చేస్తున్నాడని అన్నారు.. శ్రీశైలం, నీటి మట్టం పడిపోయి సోమశిలకు నీరు రాకపోతే నెల్లూరు జిల్లా తీవ్ర కరువు బారిన పడే ప్రమాదం ఉందని చెప్పారు..జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతు, ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.. పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని ఆపలేరని అన్నారు.

రాబోయే రోజుల్లో కూటమి పాలకులను ప్రజలు తరిమి కొట్టడం ఖాయం అని అన్నారు. ప్రస్తుత పాలన ఎమర్జెన్సీ, బ్రిటిష్ కాలం నాటి తెల్ల దొరల పాలనను గుర్తుచేస్తోందని చెప్పారు.

మా లక్ష్య సాధనలో ఎవరైనా అడ్డంకులు, అవరోధాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోం అని అన్నారు... కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన రైతులకు, వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story