Nellore: వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం..కూటమి పాలనపై నేతల ధ్వజం!
Nellore: శ్రీ కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ నగర నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆధ్వర్యంలో ఐడీ కార్డుల పంపిణీ.
Nellore: వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం..కూటమి పాలనపై నేతల ధ్వజం!
Nellore: నెల్లూరు శ్రీ కన్వెన్షన్ హాల్లో వైస్సార్సీపీ సిటీ ఇన్ చార్జ్ MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం వైస్సార్సీపీ నియోజకవర్గం స్థాయి కార్యకరల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కొండ్రేడ్డి రంగా రెడ్డి గారు వైస్సార్సీపీ నేతలతో కలిసి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు
చంద్రబాబు నాయుడు ఈరాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నాడని జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు..ద్వజమేత్తారు.ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కూటమి పాలనలో ఘోరంగా మోసపోయారని అన్నారు. మెగా DSC అక్రమాలను.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు రాష్ట్రంలోనే మొట్ట మొదటగా బయటపెట్టి.. కూటమి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశారని అన్నారు.
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని సీట్లు గెలిచి.. తీరుతుందని.. ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైసిపి నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు.పార్టీ కోసం కష్టపడిన వారికి సమూచిత స్థానం కల్పిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం మొదటిసారి అక్రమ కేసు పెట్టి జైల్లో వేసినప్పుడు వారికి అండగా నిలిచి కూటమి ప్రభుత్వ కుట్రలను ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అరాచకాలు, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. మెగా డీఎస్సీ స్కామ్ లో అడ్డగోలుగా దొరికిపోయిన కూటమినేతలు ఇప్పుడు ఏమి చేయాలో తలలు పట్టుకుంటున్నారని అన్నారు.
ఈరోజు కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.మళ్లీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి.. ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
అనంతరం నేతలు కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




