Nellore: విపిఆర్ స్కూల్‌లో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే!

Nellore: నెల్లూరు విపిఆర్ స్కూల్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

A Praveen, Nellore
Published on: 15 Aug 2026 4:03 PM IST
Nellore
X

Nellore: విపిఆర్ స్కూల్‌లో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే!

Nellore: విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలు సాధించడం, క్రమశిక్షణతో మెలగడమే నిజమైన దేశ నిర్మాణమని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు, కనపర్తిపాడులోని వీపీఆర్ ఫౌండేషన్‌కు చెందిన వీపీఆర్ స్కూల్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగిస్తూ, దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగఫలంగానే నేడు 140 కోట్లకు పైగా భారతీయులు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. మన కులాలు, మతాలు వేరైనా మనమందరం భారతీయులమనే భావనతో ఉండాలని సూచించారు. భావి భారత నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. విద్యార్థులు బాగా చదువుకోవడం, ఒక చెట్టు నాటడం, క్రమశిక్షణతో జీవించడం వంటివి కూడా దేశ నిర్మాణంలో భాగమే అవుతాయని అన్నారు. విద్యార్థులు చేసే మంచి పనులే వారి భవిష్యత్తును, తద్వారా దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.

ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే ఈ స్కూల్ ఫౌండర్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశయమని తెలిపారు. విద్యార్థులంతా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేసి, ఆయన కలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story