Nellore: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన విజయవంతం

Nellore: నెల్లూరులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య విజయవంతంగా ముగిసింది. ఎస్పీ అజిత వేజెండ్ల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

V. Narasimhulu, Nellore
Published on: 7 Sept 2026 9:31 PM IST
Nellore
X

Nellore: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన విజయవంతం

నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు, అనగా 07.09.2026న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న పర్యటన పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య విజయవంతంగా ముగిసింది.

గౌరవ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS ఆధ్వర్యంలో SPSR నెల్లూరు జిల్లా పోలీసు శాఖ విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. పర్యటనకు సంబంధించిన ప్రతి కార్యక్రమం సజావుగా, ప్రశాంతంగా జరిగేలా వివిధ విభాగాల అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారు.

"449 మంది అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు"

జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సి.హెచ్. సౌజన్య నేతృత్వంలో మొత్తం 449 మంది అధికారులు మరియు పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.

హెలిప్యాడ్, VVIP రూట్లు, కార్యక్రమ ప్రాంగణం, ప్రవేశ–నిష్క్రమణ ప్రాంతాలు, పార్కింగ్ ప్రాంతాలు మరియు ఇతర కీలక ప్రదేశాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేశారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి, నిర్దేశిత బాధ్యతలను అప్రమత్తంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు.

"VVIP రూట్లు, యాక్సెస్ కంట్రోల్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి"

గౌరవ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా VVIP రూట్ల భద్రత, రూట్ క్లియరెన్స్, యాక్సెస్ కంట్రోల్, వాహనాల రాకపోకలు, పార్కింగ్ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులు మరియు ఇతరుల రాకపోకలు సజావుగా సాగేలా సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయం చేసుకున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.

"బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ROP, యాంటీ సబోటేజ్ బృందాలతో తనిఖీలు"

కార్యక్రమ ప్రాంగణం, హెలిప్యాడ్, VVIP మార్గాలు మరియు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, రోడ్ ఓపెనింగ్ పార్టీ (ROP), యాంటీ సబోటేజ్ చెకింగ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి.

అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచి, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తనిఖీలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు వీలుగా సంబంధిత విభాగాల మధ్య సమన్వయం ఏర్పాటు చేశారు.

"డ్రోన్లు, సీసీటీవీల ద్వారా నిరంతర పర్యవేక్షణ"

అత్యాధునిక డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. కార్యక్రమ ప్రాంగణం, హెలిప్యాడ్, VVIP రూట్లు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

బందోబస్తు విజయవంతంగా ముగిసిన అనంతరం జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS బందోబస్తులో పాల్గొన్న అధికారులను, పోలీసు సిబ్బందిని అభినందించారు. క్రమశిక్షణ, అప్రమత్తత, సమన్వయం, సమయపాలనతో విధులు నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు తెలియజేశారు.

అలాగే, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, రూట్ భద్రత మరియు ఇతర ఏర్పాట్లలో సహకరించిన జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బందోబస్తు విధుల్లో IGP సౌత్ కోస్టల్, గుంటూరు సర్వశ్రేష్ఠ త్రిపాటి IPS , జిల్లా ఎస్. పి. డా. అజిత వేజెండ్ల IPS అడిషనల్ ఎస్. పి అడ్మిన్ CH. సౌజన్య, ఇతర పోలీస్ సబ్ డివిజనల్ అధికారులు, సర్కిల్ అధికారులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story