Nellore: నారాయణ స్కూల్లో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
Nellore: నెల్లూరు గోమతి నగర్ నారాయణ సిబిఎస్ఇ స్కూల్లో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. సర్వేపల్లికి నివాళులర్పించి, ఉపాధ్యాయుల ఆశీస్సులు పొందిన విద్యార్థులు.
Nellore: నారాయణ స్కూల్లో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
నెల్లూరు: నగరంలోని స్థానిక గోమతి నగర్ నందు గల నారాయణ గోమతి సిబిఎస్ఇ స్కూల్లో శనివారం గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, మహోన్నత విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వేడుకలను నిర్వహించారు.
రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గురువుల ఆశీస్సులు అందుకున్నారు . ఈ సందర్బంగా నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, బాధ్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.వారి మార్గదర్శకత్వంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపాల్ కాంతి, ప్రిన్సిపాల్ పవనార్క్, అకడమిక్ డీన్ నారాయణ, వైస్ ప్రిన్సిపాల్స్ నోమేశ్వరి, సౌమ్య రెడ్డి, సునయన, సౌజన్య, కోఆర్డినేటర్ రూప ఏవో సాయి ప్రసాద్,బయాలజీ ఉపాధ్యాయురాలు, ప్రోగ్రామ్ కోర్డినేటర్ వర్షిణి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగాయి.




